ఆధార్ తో తప్పనిసరిగా లింక్ చేసుకోవాల్సిన డ్యాకుమెంట్స్!

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 07:13 PM

ఆధార్ తో తప్పనిసరిగా లింక్ చేసుకోవాల్సిన డ్యాకుమెంట్స్!

ఆధార్ కార్డు అత్యంత కీలకమైన డాక్యుమెంట్. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ నెంబర్ కచ్చితంగా కావాల్సిందే.

1. బ్యాంక్ అకౌంట్:

బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవాలి. బ్యాంక్ ఖాతాతో ఆధార్ అనుసంధానం చేసుకోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను నేరుగా ఖాతాకే పొందొచ్చు. పెన్షన్, వెల్ఫేర్ ఫండ్స్, స్కాలర్‌షిప్ వంటివి డైరెక్ట్‌గానే బ్యాంక్ ఖాతాలో జమవుతాయి.

2. పాన్ కార్డు:

ఆధార్ కార్డ్ నెంబర్‌ను పాన్ కార్డుతో కూడా అనుసంధానం చేసుకోవాలి. నల్లధనాన్ని అరికట్టేందుకు, పన్ను ఎగవేతదారులను కనుగొనేందుకు, ఫేక్ పాన్ నెంబర్లను తొలగించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

3. ఓటర్ కార్డు:

ఓటర్ ఐడీ కార్డుతో కూడా ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవలసి ఉంటుంది. కొంత మందికి ఒకటి కన్నా ఎక్కువ ఓటర్ కార్డులు ఉండొచ్చు. ఓటర్ కార్డు, ఆధార్ కార్డును లింక్ చేస్తే.. అప్పుడు దొంగ ఓటర్ కార్డులు చెల్లుబాటు కావు. దీంతో ఓటింగ్ వ్యవస్థ ప్రక్షాళన అవుతుంది.

4. ఎల్‌పీజీ గ్యాస్:

ఎల్‌పీజీ అకౌంట్‌తో కూడా ఆధార్ లింక్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా చేయాలంటే బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ అనుసంధానమై ఉండాలి. ఇలా చేయడం వల్ల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మొత్తం బ్యాంక్ ఖాతాకు వచ్చేస్తుంది.

5. రేషన్ కార్డు:

రేషన్ కార్డుతో కూడా ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలి. దీని వల్ల కేంద్ర ప్రభుత్వపు ఒకే దేశం ఒకే రేషన్ కార్డు స్కీమ్ ప్రయోజనాలు లభిస్తాయి. అంటే ఈ పథకం అమలులో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు.

6. మొబైల్ నెంబర్:

ఇప్పుడు మొబైల్ నెంబర్ తీసుకోవాలంటే ఆధార్ నెంబర్ కావాల్సిందే. రెండింటినీ అనుసంధానం చేసుకోవడం వల్ల వ్యక్తి ఐడెంటిటీ కచ్చితంగా ఉంటుంది. దీంతో పొరపాట్లకు అవకాశం ఉండదు.

7. ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్:

కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ వంటి వాటికి కూడా ఆధార్‌ను తప్పనిసరి చేస్తే బాగుటుంది. దీని వల్ల ఫేక్ లైసెన్స్‌లను నియంత్రించొచ్చు.





Untitled Document
Advertisements