కొత్త రూల్స్...బంగారం కొనాలనుకునేవారు తెలుసుకోవాల్సిన అంశాలు!

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 08:08 PM

కొత్త రూల్స్...బంగారం కొనాలనుకునేవారు తెలుసుకోవాల్సిన అంశాలు!

బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారు కచ్చితంగా వీటి గురించి తెలుసుకోవాలి. మోదీ సర్కార్ గోల్డ్ జువెలరీకి హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేసింది. జువెలరీ సంస్థలు కచ్చితంగా ఈ రూల్‌ను అనుసరించాల్సిందే. అయితే కేంద్రం జువెలరీ షాపులకు ఏడాది గడువు ఇచ్చింది. ఈలోపు బంగారం విక్రయించే వారందరూ బ్యూరో ఆఫ్ ఇడియన్ స్టాండర్డ్స్ (BIS) వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే షాపుల్లో ఉన్న బంగారు నగలను ఏడాదిలోపు విక్రయించుకోవాల్సి ఉంటుంది. 2021 జనవరి 15 నుంచి హాల్‌మార్క్ లేని ఆభరణాలను విక్రయించడం కుదరదు. అందువల్ల జువెలరీ సంస్థలు అన్నీ ఈలోపు బీఐఎస్ రిజిస్ట్రేషన్ పొందాలి. అదేసమయంలో పాత స్టాక్‌ను అమ్మేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. వచ్చే ఏడాది జనవరి 15 తర్వాత హాల్‌మార్క్ లేని నగలు అమ్మితే భారీ జరిమానాలు పడతాయి. జైలుకు వెళ్లాల్సి వస్తుంది.

1. బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్ మూడు రకాలుగా ఉంటుంది. 14 క్యారెట్, 18 క్యారెట్, 22 క్యారెట్ అనే కేటగిరిల్లో హాల్‌మార్క్ చేస్తారు.
2. బంగారు నగలు, గోల్డ్ జువెలరీ కొనుగోలు చేసే కస్టమర్లు మోసపోవద్దనే లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
3. జువెలరీ హాల్‌మార్క్‌కు చార్జీలు పడతాయి. బీఐఎస్ వెబ్‌సైట్ ప్రకారం.. ఒక ఆభరణానికి హాల్‌‌మార్క్ కోసం రూ.35 తీసుకుంటారు.
4. హాల్‌మార్కింగ్ వల్ల కస్టమర్లు వారు కొనే ఆభరణాల స్వచ్ఛత గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. మోసపోవడానికి వీలుండదు.
5. గోల్డ్ జువెలరీ హాల్‌మార్క్‌లో నాలుగు మార్క్స్ ఉంటాయి. బీఐఎస్ మార్క్, ప్యూరిటీ (క్యారెట్), హాల్‌మార్క్ సెంటర్ నేమ్, జువెలర్స్ ఐడెంటిఫికేషన్ మార్క్ అనే అంశాలను హాల్‌మార్క్‌లో చూడొచ్చు.





Untitled Document
Advertisements