బిఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్‌!

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 11:30 AM

బిఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్‌!

ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ తన కస్టమర్లకు జబర్దస్త్ ఆఫర్‌ ను ప్రకటించింది. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఫ్రీపెయిడ్‌ వినియోగదారులకు ప్లాన్‌ ముగిసిన తర్వాత కూడా వారం రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తున్నట్టు ప్రకటించింది. బిఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌ 105, 153, 171, 186, 429, 485, 666, 1699 రీఛార్జిలు చేసుకున్న కస్టమర్లు ప్లాన్‌ ముగిసిన వారం రోజుల వరకు వ్యాలిడిటీని పొందుతారు. ఈ వారం రోజులకు అదనంగా రూ.19 మెయిన్‌ అకౌంట్ బ్యాలెన్స్‌ నుంచి మినహాయించనుంది బిఎస్‌ఎన్‌ఎల్‌. అంతే కాకుండా రద్దయిన నేస్తం… ఫ్రీడమ్‌.. వెన్నెల.. వెన్నెల ప్లస్‌.. జీవిత.. ప్రతిభ.. ప్రతిభ ప్లస్‌.. వినియోగదారులకు ఈ అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు.





Untitled Document
Advertisements