ముగ్గురు కామాంధులకు ఉరిశిక్ష వేసిన కర్ణాటక కోర్టులు

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 02:16 PM

ముగ్గురు కామాంధులకు ఉరిశిక్ష వేసిన కర్ణాటక కోర్టులు

కర్ణాటకలోని రెండు న్యాయస్థానాలు కామాంధులకు మరణశిక్షలు విధిస్తూ తీర్పులు చెప్పాయి. మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో 65 ఏళ్ల వృద్ధుడికి కోలార్ రెండో సెషన్స్‌ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. భైరండహళ్లి గ్రామానికి చెందిన వెంకటేశప్ప 2018, మే 1వ తేదీన అదే గ్రామానికి చెందిన మైనర్‌ బాలికకు మాయ మాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై వేమగల్‌ పోలీస్‌‌స్టేషన్లో కేసు నమోదైంది. నేరం నిరూపణ కావడంతో జడ్జి రేఖ ఆ కామాంధుడికి ఉరిశిక్ష విధించారు. చిక్కమంగళూరు జిల్లా శృంగేరిలో కాలేజీ విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడి దారుణంగా హత్య చేసిన కేసులో ఇద్దరు మృగాళ్లకు స్పెషల్ కోర్టు మరణశిక్షను విధించింది. 2016, ఫిబ్రవరి 16న శృంగేరి తాలూకా మెణసె గ్రామానికి చెందిన యువతి కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుంగా ఆదే గ్రామానికి చెందిన సంతోష్, ప్రదీప్‌ ఆమెను ఎత్తుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను చంపేసి పాడుబడిన బావిలో పడేసి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతోష్, ప్రదీప్‌ను అరెస్ట్ చేసి కేసు విచారణ చేపట్టారు. పక్కా ఆధారాలు కోర్టులో సమర్పించడంతో చిక్కమంగళూరు స్పెషల్ కోర్టు జడ్జి ఎం.ఉమేశ్‌ అడిగ వారిద్దరిని దోషఉలుగా నిర్ధారించి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.





Untitled Document
Advertisements