సరికొత్త రికార్డు సృష్టించిన హ్యుండాయ్ విద్యుత్ కారు

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 02:18 PM

సరికొత్త రికార్డు సృష్టించిన హ్యుండాయ్ విద్యుత్ కారు

హ్యుండాయ్ దేశీయంగా తయారు చేసిన కోనా విద్యుత్ కారు సరికొత్త రికార్డు సృష్టించింది. టిబెట్‌లోని సావులా కొండల్లో 5,731 మీటర్ల ఎత్తుకు ప్రయాణించి గిన్నిస్ బుక్ రికార్డ్‌లో స్థానం సంపాదించింది. ఇప్పటివరకు అంత ఎత్తువరకు ప్రయాణించిన వాహనాల్లో ఇది దేశీయంగా రూపొందించిన తొలి విద్యుత్ వాహనం కావడం గమనార్హం. గతంలో నియో 80ఎస్ కారు 5,175 మీటర్ల ఎత్తు ప్రయాణించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు హ్యుండాయ్ కోనా ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఈ కారు ప్రయాణంలో దానితో పాటు అమర్చిన పోర్టబుల్ రీచార్జర్ ద్వారా బ్యాటరీ రీచార్జి చేసుకుందని సంస్థ తెలిపింది. కోనా ఎలక్ట్రిక్ కారు కష్టతరమైన భూభాగాల్లో నూ ప్రయాణించి దాని సామర్థాన్ని నిరూపించుకుందని హ్యుండాయ్ మోటార్స్ ఎండి, సిఇఓ ఎస్‌ఎస్ కిమ్ తెలిపారు. ఇది తమ సంస్థ ఎంతో గర్విచదగ్గ విషయమన్నారు.ఈ కారుకు 39.2 కె డబ్లు హెచ్ సామర్థం కలిగిన బ్యాటరీని అమర్చారు. అది ఒక పారి రీచార్జి చేస్తే 452 కిలోమీటర్ల దేరం న్రయాణించడానికి అవకాశం ఉంటుందని సంస్థ తెలిపింది.





Untitled Document
Advertisements