చిన్నారిని చంపిన రేపిస్టుపై పెట్రోల్ పోసి సజీవ దహనం

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 02:19 PM

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన ఓ వ్యక్తిని గ్రామస్తులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు వచ్చే లోపే అతడిని బూడిద చేశారు. ఈ ఘటన మెక్సికోలోని చియాపస్‌లో చోటుచేసుకుంది. జనవరి 9 నుంచి ఓ బాలిక కనిపించకుండా పోయింది. ఆమె కోసం తల్లిదండ్రులు వెతకని ప్రాంతం లేదు. తర్వాతి రోజు ఆ చిన్నారి శవం గ్రామంలోని రోడ్డు పక్కన పడివుంది.

అల్‌ఫ్రెడో రొబ్లేరో అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని గ్రామస్తులు అనుమానించారు. దీంతో ఆ బాలిక బంధువు ఒకరు రొబ్లెరో‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించేందుకు లాక్కెళ్తుండగా.. గ్రామస్తులు ఆమెను అడ్డుకున్నారు. పోలీసులకు అప్పగిస్తే న్యాయం జరగదంటూ.. గ్రామస్తులు అతడిని అక్కడే చితకబాదారు. అనంతరం అతడి మీద పెట్రోలు పోసి సజీవ దహనం చేశారు. అత్యాచారాలకు పాల్పడే నేరగాళ్లకు ఇదే తగిన శిక్ష అంటూ ఆగ్రహంతో రగిలిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరేలోపే రొబ్లేరో చనిపోయాడు. దీంతో పోలీసులు గ్రామస్తులపై చర్యలు తీసుకోడానికి సిద్ధమయ్యారు. అయితే, అతడిని చంపింది ఎవరనే విషయం ఎవరూ వెల్లడించకపోవడంతో పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదుచేసుకున్నారు. అయితే, రొబ్లేరో ఆ చిన్నారిని రేప్ చేసి, హత్య చేశాడని చెప్పేందుకు ఎవరి వద్ద తగిన ఆధారాలు లేవు. కేవలం అనుమానంతోనే అతడికి నిప్పుపెట్టి సజీవ దహనం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, వీడియో హింసాత్మకంగా ఉండటంతో యూట్యూబ్ నుంచి తొలగించారు.





Untitled Document
Advertisements