దున్నపోతు ‘వయాగ్రా’ను మింగాడు...చివరికి ఏమైందంటే!!!

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 03:09 PM

దున్నపోతు ‘వయాగ్రా’ను మింగాడు...చివరికి ఏమైందంటే!!!

మెక్సికోలోని వర్యాక్రూస్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పశువుల వయాగ్రా తీసుకుంటే మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని భావించాడో ఏమో.. ఊరంతా తిరిగి మరీ వాటిని కొనుగోలు చేశాడు. 30 ఏళ్ల మహిళతో డేటింగ్ చేస్తున్న అతడు.. లేక లేక వచ్చిన ఛాన్సును వదులుకోవడం ఇష్టం లేక తన పవర్ చూపిద్దాం అనుకున్నాడు. పసువుల వయాగ్రా మాత్రను నీళ్లలో కలుపుకుని గడగడా తాగేశాడు. ఊహించినట్లే.. అతడికి అంగస్తంభన కలిగింది. ప్రియురాలిని కూడా బాగానే మెప్పించాడు. కానీ, ఎంతసేపు గడుస్తున్నా.. అతడి అంగం మాత్రం సాధారణ స్థితికి చేరలేదు. గంటలు కాదు.. రోజులు గడిచాయి. మూడో రోజు కూడా అతడి అంగం అలాగే స్తంభించి గట్టిగా ఉంది. బయట కూడా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. బాగా మంట పెట్టడంతో రేనెసాలోని ఓ హాస్పిటల్‌లో చేరాడు. సాధారణ మందులతో అతడి అంగాన్ని సాధారణ స్థితికి చేర్చడం వైద్యుల వల్ల కాలేదు. దీంతో అతడికి సర్జరీ చేశారు. అయితే, ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇంకా తెలియరాలేదు. అతడు కొనుగోలుచేసిన పసువుల వయాగ్రాను దున్నపోతుల కోసం ఉపయోగిస్తారు. పసువుల కోసం తయారు చేసే వయాగ్రా, సంతానోత్పత్తి మాత్రలు మనుషులకు ఏమాత్రం సరిపోవు. వాటి సామర్థ్యం రెండింతలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. మీరెప్పుడూ ఇలాంటి ప్రయోగాలు చేయకండి.






Untitled Document
Advertisements