మందులను రక్తంలో కలిపే రోబోట్స్!

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 04:58 PM

మందులను రక్తంలో కలిపే రోబోట్స్!

మందులేసుకుంటే అది రక్తంలో కలిసి టార్గెట్​పై పనిచేస్తుంది. మరి, నేరుగా టార్గెట్​ దగ్గరకే మందులను మోసుకెళ్లే చిన్న చిన్న రోబోలుంటే..? వాటికి జీవం ఉంటే..? మందును చేర్చాక వాటంతట అవే చచ్చిపోయి డీగ్రేడ్​ అయిపోతే..? మెడికల్​ సైన్సెస్​లో అది ఓ రెవల్యూషన్​ అవుతది. అలాంటి రెవల్యూషన్​నే క్రియేట్​ చేశారు కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్​ వెర్మాంట్​ సైంటిస్టులు. జీనోపస్‌ లేవిస్‌ అనే కప్ప అండ కణాలను తీసుకుని ‘జీనోబోట్స్​’ అనే లివింగ్​ డ్రగ్​డెలివరీ రోబోలను తయారు చేశారు. డీప్​గ్రీన్​ సూపర్​కంప్యూటర్​ ద్వారా వందలాది జీవమున్న కణాలతో కూడిన రోబోట్​ డిజైన్ల ఆల్గారిథంలను సృష్టించారు. ఓ డిజైన్​ను ఫైనల్​ చేశాక, టఫ్ట్స్​ యూనివర్సిటీ సైంటిస్టుల సాయంతో జీనోబోట్స్​ను సృష్టించారు. తీసుకున్న కణాలను కోసి, ఫైనల్​ చేసిన డిజైన్​ వచ్చే దాకా మైక్రోస్కోప్​ కింద వాటికి తుది మెరుగులు దిద్దారు. డ్రగ్​ను టార్గెట్​కు మోసుకెళ్లాక వారం రోజులకు ఆ కణాలు తమంతట తామే చనిపోతాయని, సగానికి సగం కట్​ చేసినా, మళ్లీ పెరిగే శక్తి వాటికుంటుందని అంటున్నారు.





Untitled Document
Advertisements