IND vs AUS 3rd ODI: షమీ దెబ్బ అదుర్స్...భారత్ టార్గెట్ 287

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 05:42 PM

IND vs AUS 3rd ODI: షమీ దెబ్బ అదుర్స్...భారత్ టార్గెట్ 287

టీంఇండియాతో జరుగుతున్న సిరీస్ విజేత నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. స్టీవ్‌స్మిత్ ( 131: 132 బంతుల్లో 14x4, 1x6) సెంచరీ బాదడంతో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. చిన్నస్వామి స్టేడియం పిచ్.. మ్యాచ్ జరిగేకొద్దీ స్లోగా మారే స్వభావం ఉండటంతో.. లక్ష్య ఛేదనలో టీమిండియా జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. ఈ కారణంగానే టాస్ గెలిచిన అరోన్ ఫించ్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. రాత్రి 7 గంటల నుంచి మంచు కురవనుండటం టీమిండియాకి లాభించే అంశం. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా రెండు, కుల్దీప్, సైనీ తలో వికెట్ తీశారు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. ఆరంభం ఓవర్లలోనే డేవిడ్ వార్నర్ (3), అరోన్ ఫించ్ (19)ని బోల్తా కొట్టించిన టీమిండియా ఆ జట్టుని ఒత్తిడిలోకి నెట్టగా.. రెండో వన్డేలో 98 పరుగులు చేసి ఔటైన స్టీవ్‌స్మిత్ ఈరోజు పట్టుదలతో క్రీజులో నిలిచి శతకం బాదేశాడు. మిడిల్ ఓవర్లలో లబుషేన్ (54: 64 బంతుల్లో 5x4)తో కలిసి 127 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన స్టీవ్‌స్మిత్.. ఆ జట్టుకి 300 పరుగుల స్కోరుని అందించేలా కనిపించాడు. కానీ.. స్లాగ్ ఓవర్లలో మరోసారి చెలరేగిన మమ్మద్ షమీ వరుస ఓవర్లలో స్టీవ్‌స్మిత్‌తో పాటు పాట్ కమిన్స్ (0), ఆడమ్ జంపా (1)లను ఔట్ చేసేశాడు. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన అలెక్స్ క్యారీ (35), టర్నర్‌ (4)లను కుల్దీప్, జడేజా ఔట్ చేయడంతో ఆఖర్లో ఆస్ట్రేలియా స్కోరు బోర్డు నెమ్మదించింది. తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందగా.. రెండో వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements