ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్...ఇక సిగ్నల్ ప్రాబ్లమ్స్ కి చెక్

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 06:01 PM

ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్...ఇక సిగ్నల్ ప్రాబ్లమ్స్ కి చెక్

భారతదేశంలో మొట్టమొదటి సారిగా ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్- అడపాదడపా సెల్ ఫోన్ కవరేజ్‌లో సంభవించే సమస్యలను ఎదుర్కోవడానికి ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ కలిగిన యూజర్లు 22 మిలియన్‌గా ఉన్నట్లు ఎయిర్‌టెల్ గుర్తించింది. ప్రస్తుతానికి, 22 డివైసెస్ కవర్ చేస్తున్న ఎయిర్‌టెల్ VoLTE సదుపాయం కలిగిన 6 మిలియన్ ఖాతాదారులను వైఫై కాలింగ్ సామర్థ్యం ఉన్నవారిగా గుర్తించింది. అయితే తొందరలోనే ఈ సంఖ్య 25 మిలియన్ డివైసెస్‌కు చేరుతుందని ఎయిర్‌టెల్ ఆశిస్తోంది. సెల్ టవర్ యొక్క నెట్‌వర్క్‌పై ఆధారపడకుండా ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్, వైఫై కనెక్షన్ ఉపయోగించి ఇంటర్నెట్ ద్వారా కాల్ చేసేలా చేస్తుంది. అర్ధమయ్యేలా చెప్పాలంటే, గతంలో ఫోన్ కాల్ చెయ్యడానికి ఫోన్ నెట్‌వర్క్ పై (ఇంటి లోపల తక్కువ నాణ్యత కలిగి ఉండేవి) ఆధారపడేవారు, ఇప్పుడు కాల్ చెయ్యడానికి వైఫై కనెక్షన్‌ను ఉపయోగించవచ్చు. మరియు దీని కోసం వేరే ఆప్ ఉపయోగించనవసరం లేదు. ఒక సాధారణ కాల్‌లానే వైఫై కాల్‌ను కూడా చెయ్యచ్చు.

LTE పై ఆధారపడకుండా వైఫై సదుపాయంతో కాల్స్ చేసుకోవచ్చు
వేరే ఆప్‌ను ఉపయోగించకుండానే పోస్ట్ పెయిడ్ మరియు ప్రీ పెయిడ్ యూజర్లు వారి వైఫైను ఉపయోగించి కాల్స్ చేసుకోవచ్చు
ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించనవసరం లేదు
ఎయిర్‌టెల్ వైఫై కాల్‌తో అత్యంత నాణ్యమైన కాలింగ్‌ను ఆనందించండి.
ప్రక్కనే కూర్చుని మాట్లాడుతున్నట్టు అత్యంత నాణ్యమైన కాలింగ్‌ను అనుభవించండి. - HD వైఫై కాల్ - అధిక నాణ్యత
అత్యధిక వేగంతో కాల్ కనెక్ట్ చేసుకోవచ్చు.
అవసరమైనప్పడు వైఫై కాల్‌కు ఆటోమేటిక్‌గా మారవచ్చు.
మనం ఎవరికైనా కాల్ చెయ్యాలనుకున్నప్పుడు, కాల్ కనెక్ట్ కాకపోయినా లేదంటే కాల్ మధ్యలో కట్ అయిపోయినా చాలా బాధపడతాము. అయితే ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్‌తో ఆ సమస్యలను అధిగమించవచ్చు.

ఈ సర్వీస్‌ను పొందడం చాలా సులభం. ఇంటిలో టీ చెయ్యడానికి పట్టే సమయం లోపలే దీనిని పొందవచ్చు. దీనికి మీరు చెయ్యాల్సినదల్లా మీ స్మార్ట్ ఫోన్‌ను లేటెస్ట్ OS కు అప్‌గ్రేడ్ చేసి వోల్ట్ స్విచ్ మరియు వైఫై కాలింగ్ స్విచ్‌ను ఎనేబల్ చెయ్యడమే. ప్రారంభ దశలో భాగంగా, ఎయిర్‌టెల్ కేవలం NCR ప్రాంతంలో 22 స్మార్ట్ ఫోన్స్ లో మాత్రమే ఈ సదుపాయాన్ని అందుబాటులోనికి తెచ్చింది. అయితే 2020 ప్రారంభం నుండి దేశంలోని మిగతా ప్రాంతాలలో కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోనికి తెచ్చే ఆలోచనలో ఉంది. కాబట్టి, ఈ ఆప్షన్ మీ ఫోన్ లో కనపడకపోతే, కాస్త సమయం ఎదురుచూడండి.










Untitled Document
Advertisements