జాబ్ చేస్తూ బిజినెస్ చేసుకోవచ్చు తెలుసా...!

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 07:12 PM

జాబ్ చేస్తూ బిజినెస్ చేసుకోవచ్చు తెలుసా...!

ఒకపక్క జాబ్ చేస్తూనే పార్ట్ టైం జాబ్ కోసం ట్రై చేస్తుంటారు చాలామంది. అయితే పార్ట్ టైం జాబ్ కోసం కేటాయించే టైంని కొన్ని బిజినెస్ ఐడియాలకోసం కేటాయిస్తే పార్ట్ టైం జాబ్‌‌కి బదులు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. రోజూ కొంత టైం కేటాయించి, ఉద్యోగం డిస్టర్బ్ అవ్వకుండా చేసుకోగలిగే కొన్ని బిజినెస్‌‌లు ఏంటంటే.. ఇదొక సింపుల్ బిజినెస్. దీనికి కావాల్సిందల్లా కొద్దిగా టైం అంతే.. పార్టీ ప్లానర్స్ అంటే పార్టీని ప్లాన్ చేసి, మేనేజ్ చేసేవాళ్లు. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి స్కిల్స్ అవసరంలేదు. కలుపుగోలుగా మాట్లాడగలిగితే చాలు. పార్టీ ప్లానర్స్ బిజినెస్‌‌లో పార్టీస్‌‌కి కావాల్సిన ఎరేంజ్‌‌మెంట్స్.. అంటే కేక్స్, డెకరేషన్, కుర్చీలు, సోఫాలు, ఫుడ్ ఇలాంటివన్నీ ప్లాన్ చేయాలి. దానికోసం బేకరీస్‌‌తో, డెకరేషన్, ఫుడ్ సప్లై వాళ్లతో కాంటాక్ట్స్ మెయింటెయిన్ చేయాలి. పార్టీ ప్లానర్స్‌‌గా బిజినెస్ మొదలుపెడుతున్నట్టు స్నేహితులు, బంధువులు తెలిసినవాళ్లకు చెప్పాలి. అలా ఎంతమంది కస్టమర్లను సంపాదించుకుంటే బిజినెస్ అంతగా డెవలప్ చేయొచ్చు. దీనికోసం అయ్యే పెట్టుబడి చాలా తక్కువ. జాబ్ చేస్తూనే చేసుకోవచ్చు. ఎక్కువగా టైం లేకపోతే ఫోన్ కాల్స్ ద్వారా కూడా పార్టీని ప్లాన్ చేయొచ్చు. కారు, బైక్ వాషింగ్ కోసం షెడ్డు దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటికే వచ్చి వాష్ చేస్తారు లేదా కారు తీసుకెళ్లి వాష్ చేసి తీసుకొస్తారు. ఇప్పుడు ఈ ట్రెండ్ బాగా నడుస్తుంది. అందుకే మొబైల్ కార్ వాష్ బిజినెస్ పెడితే ఈజీగా సక్సెస్ అవ్వొచ్చు. దీనికోసం కారు, బైక్ వాషింగ్ ఎక్స్‌‌పర్ట్స్‌‌ని ఫ్రీలాన్సర్స్‌‌గా నియమించుకోవాలి. క్వికర్, ఓఎల్ఎక్స్, జస్ట్ డయల్ లాంటి ఆన్‌‌లైన్ సర్వీసెస్ యాప్స్‌‌లో ఫేస్‌బుక్‌లో బిజినెస్‌కు సంబంధించిన వివరాలు నమోదు చేసి ఉంచితే.. అవసరమైన వాళ్లు కాంటాక్ట్ చేస్తారు. వాళ్ల అడ్రెస్‌‌ని బట్టి ఉన్న స్టాఫ్‌‌ను అక్కడికి పంపిస్తే సరిపోతుంది. ఈ బిజినెస్‌‌కు కూడా కొద్దిగా టైం ఉంటే చాలు. ఫోన్ కాల్స్ ద్వారానే మేనేజ్ చేయొచ్చు. ఈ రోజుల్లో సోషల్ మీడియా పరిచయం లేని వాళ్లు ఉండరు. దాదాపుగా అందరూ ఏదో ఒక సోషల్ మీడియా యాప్స్‌‌ను వాడుతూనే ఉంటారు. అయితే సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోస్, మీమ్స్, రివ్యూ్స్ లాంటివి లేదా మరేదైనా ఇంట్రెస్టింగ్ కంటెంట్ క్రియేట్ చేసే టాలెంట్ ఉంటే.. సోషల్ మీడియా ప్లాట్ ఫాంను ఉపయోగించుకుని ఎంచక్కా బిజినెస్ చేయొచ్చు. ఎలాగంటే.. మీకు బాగా తెలిసిన విషయాలను సోషల్ మీడియాలో అప్‌‌లోడ్ చేస్తూ సొంతంగా ఒక పేజీ లేదా అకౌంట్‌‌ను రన్ చేయాలి. క్రియేటివ్‌‌ కంటెంట్ పోస్ట్ చేస్తూ.. మెల్లగా ఫాలోవర్స్‌‌ను పెంచుకుంటూ పోవాలి. తగినంత ఫాలోవర్స్‌‌ను సంపాదించుకున్నాక మెల్లగా సోషల్ మీడియా ప్రమోటర్‌‌‌‌గా మారిపోవచ్చు. ఫాలోవర్స్‌‌ను బట్టి రకరకాల కంపెనీలు, సినిమాలు లాంటివి సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసం ప్రమోటర్స్‌‌ను సంప్రదిస్తాయి. ఈ బిజినెస్‌‌కు కూడా ఎక్కువగా టైం అక్కర్లేదు. రోజూ సోషల్ మీడియా వాడే టైంను కంటెంట్ కోసం కేటాయిస్తే సరిపోతుంది. ఈ రోజుల్లో ఫ్రీలాన్సర్ టెకీలకు చాలా డిమాండ్ ఉంది. వెబ్ డెవలప్‌‌మెంట్, యాప్ డెవలప్‌‌మెంట్, వెబ్‌‌సైట్ డిజైనింగ్ లాంటి స్కిల్స్ ఉంటే ఆన్‌‌లైన్‌‌లో సొంతంగా సాఫ్ట్‌‌వేర్ సర్వీసెస్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మార్కెట్లో వెబ్‌‌సైట్లు, యాప్‌‌ల అవసరం ఉన్నవాళ్లు చాలామంది ఉంటారు. తెలిసిన వాళ్ల ద్వారా అలాంటి ప్రాజెక్టులు సంపాదిస్తూ టైంకి వాటిని పూర్తి చేసి, మంచి సర్వీస్ అందిచడం ద్వారా మంచి సక్సెస్‌ అందుకోవచ్చు. కాస్త టైం మేనేజ్ చేసుకుని రోజుకు కొంత సమయం కేటాయించగలిగితే చాలు. ఫ్రీలాన్సర్‌‌‌‌గా సాఫ్ట్‌‌వేర్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. చేసేది వేరే ఉద్యోగమైనా.. రకరకాల రంగాలపై ఇంట్రెస్ట్ ఉంటుంది చాలామందికి. ఉదాహరణకు కంప్యూటర్స్, మొబైల్స్, కార్లు, బైకులు, వంటలు, పెయింటింగ్, ఫొటోగ్రఫీ ఇలా రకరకాల విషయాల్లో నాలెడ్జ్ ఉన్నవాళ్లు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్లంతాఆన్‌‌లైన్ లో లేదా బయట క్లాసులు చెప్పొచ్చు. రోజుకు రెండు మూడు గంటల టైం కేటాయించి, ఎంచుకున్న టాపిక్ గురించి క్లాస్ చెప్తే చాలు. బ్లాగింగ్ అందరికీ తెలిసిందే.. నచ్చిన, తెలిసిన విషయాలను వెబ్‌‌సైట్ ద్వారా అందరికీ పంచుకోవడమే బ్లాగింగ్. బ్లాగింగ్ ఎవరైనా చేయొచ్చు. సొంత అనుభవాలను లేదా బాగా తెలిసిన విషయాలను క్రియేటివ్‌‌గా బ్లా్గ్స్ రూపంలో రాయగలగాలి. చాలామందికి వంటలు, అల్లికలు, ఫ్యాషన్, టెక్నాలజీ, సినిమా లాంటి విషయాల్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్‌‌ను బ్లాగ్ రూపంలోకి మార్చి క్రియేటివ్‌‌గా రాయగలిగితే చాలు. కొద్దికొద్దిగా వెబ్‌‌సైట్ వ్యూయర్స్ సంఖ్యను పెంచుకుంటూ పోవాలి. ఎక్కువమంది వ్యూయర్స్ ఉంటే గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా యాడ్స్ వస్తుంటాయి. ఆ యాడ్స్ డిస్ ప్లే చేసినందుకు గానూ కొంత డబ్బును సంపాదించొచ్చు. ఇలా ఎవరైనా రోజుకు కొంత టైం కేటాయిస్తే ఈజీగా బ్లాగ్ నడపొచ్చు.





Untitled Document
Advertisements