నల్లరిబ్బన్లతో మైదానంలోకి టీంఇండియా..ఎందుకో తెలుసా?

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 07:48 PM

నల్లరిబ్బన్లతో మైదానంలోకి టీంఇండియా..ఎందుకో తెలుసా?

భారత్-ఆసిస్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆఖరి వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వన్డేలో భారత ఆటగాళ్లందరూ తమ భుజాలకు నల్లటి రిబ్బన్‌ను ధరించి ఆడారు. మరణించిన దిగ్గజ ప్లేయర్‌కు సంతాప సూచకంగా భారత ప్లేయర్లు ఈ రిబ్బన్‌ను ధరించారు. ఆ ప్లేయర్ పేరేమిటంటే.. బాపు నాదకర్ణి.. టెస్టు క్రికెట్లో బాపు నాదకర్ణికి ప్రత్యేకమైన స్థానముంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా 1961 ఇంగ్లాండ్‌తో టెస్టు సందర్భంగా అందరి దృష్టిని ఆయన ఆకర్షించారు. ఆ మ్యాచ్‌లో బౌలర్లు కలగనే సంచలనాత్మక స్పెల్ (32-27-5-0) వేశారు. 32 ఓవర్లు వేసి కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చారు. 27 మెయిడిన్లు వేశారు. ఇందులో వరుసగా 21 మెయిడిన్లు వేశారు. ఇప్పటికీ ఈ రికార్డు పదిలంగానే ఉంది. ఓవరాల్‌గా తన కెరీర్‌లో 45 టెస్టులాడిన బాపు.. 88 వికెట్లు తీశారు. ఈక్రమంలో ఆయన ఎకానమీ రేటు కేవలం 1.68 కావడం విశేషం. 50 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసినా వాళ్లలో ఆయనదే బెస్ట్. ఈనెల 17న బాపు మరణించారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. నాదకర్ణి మృతిపై భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సహా పలువురు సంతాపం తెలిపారు. ఈక్రమంలో బాపు మరణించడం చాలా బాధకరమని పేర్కొన్న సచిన్, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాను క్రికెట్ ఆడే రోజుల్లో ఆయన రికార్డులు వింటూ పెరిగానని చెప్పుకొచ్చాడు. మరో లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కూడా సంతాపం తెలిపారు. ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి అని ఆయన చెబుతుండేవారని సన్నీ తెలిపాడు.






Untitled Document
Advertisements