బాలయ్య వైట్ అండ్ వైట్ లుక్...వైరల్ పిక్

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 07:55 PM

బాలయ్య వైట్ అండ్ వైట్ లుక్...వైరల్ పిక్

‘రూలర్’ సినిమాలో ఐరన్ మ్యాన్ లుక్‌తో ఆకట్టుకున్న బాలయ్య ఇప్పుడు మరో కొత్త లుక్‌తో అభిమానులను కట్టిపడేస్తున్నారు. ఇది బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న సినిమా కోసమేనని అంటున్నారు. వైట్ అండ్ వైట్ ఖద్దరు దుస్తుల్లో గుండు, గుబురు మీసాలతో బాలయ్య లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రకరకాల పాత్ర కోసం రకరకాల విగ్‌లు వాడే బాలయ్య విగ్ లేకుండా కూడా మాస్ లుక్‌తో అదరగొడుతున్నారని ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. బాలయ్య విషయంలో బోయపాటి మరోసారి తన మార్క్‌ను చూపించారని అంటున్నారు. రేపటి నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలంతా పాల్గొనాలని టీడీపీ విప్ జారీ చేసింది. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు బాలయ్య ఇప్పటికే విజయవాడ వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఫొటో అక్కడ తీసుకున్నదేనని తెలిసింది. ఈ లుక్ నిజంగా బోయపాటి సినిమా కోసమే అయితే బాలయ్య ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. నిజానికి పాత్ర కోసం గుండు చేయించుకున్న స్టార్ హీరోలు ఈ మధ్యకాలంలో లేరు. ఈ సినిమా కోసం ఇప్పటికే బాలకృష్ణ 15 కేజీల బరువు తగ్గారు. బాలయ్య బరువు తగ్గడం ‘రూలర్’ సినిమాలోనూ కనిపించింది. ఒక సినిమా కోసం బాలకృష్ణ ఇంత కష్టపడుతున్నారంటే స్క్రిప్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గత రెండు చిత్రాల్లో బాలయ్యను పవర్‌ఫుల్‌గా చూపించిన బోయపాటి.. ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి పెరుగిపోతోంది.







Untitled Document
Advertisements