కోహ్లీ ఖాతాలో మరో వరల్డ్ రికార్డ్

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 08:54 PM

కోహ్లీ ఖాతాలో మరో వరల్డ్ రికార్డ్

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా ఆ దిశగా మరో ముందడుగు వేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో అత్యంత వేగంగా 5వేల పరుగులు చేసిన కెప్టెన్‌గా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. కేవలం 82వ ఇన్నింగ్స్‌లోనే కోహ్లీ ఈ ఘనత సాధించడం విశేషం. గతంలో ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (127 ఇన్నింగ్స్) పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌కు ముందు 4,983 పరుగులతో నిలిచిన కోహ్లీ.. భారత ఇన్నింగ్స్ 23వ ఓవర్లో ఈ ఘనత సాధించాడు. మిషెల్ స్టార్క్ వేసిన బంతిని బౌండరీకి తరలించి 5వేల పరుగుల మార్కును దాటాడు. కోహ్లీకంటే ముందు ధోనీతోపాటు రికీ పాంటింగ్ (133), గ్రేమ్ స్మిత్ (135), సౌరవ్ గంగూలీ (136 ఇన్నింగ్స్) ఈ మార్కును చేరారు. అయితే ధోనీతో పోలిస్తే 45 తక్కువ ఇన్నింగ్స్‌తోనే కోహ్లీ ఈ రికార్డు అందుకోవడం విశేషం. ఇటీవలే కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి 11వేల పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. బెంగళూరు వన్డేలో భారత్ అదరగొడుతోంది. ఈ టోర్నీలో తొలిసారి ఫామ్‌లోకి వచ్చిన భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. వన్డేల్లో తనకిది 29వ శతకం కావడం విశేషం. మరోవైపు ఇది ఆసీస్‌పై ఎనిమిదో సెంచరీ. అంతకుముందు హిట్‌మ్యాన్ వన్డేల్లో తను 9వేల పరుగుల మార్కును దాటాడు. ఈక్రమంలో ఈ ఘనతను అత్యంత వేగంగా పూర్తి చేసిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఉన్నారు.





Untitled Document
Advertisements