అప్పుల్లో మునుగుతున్న బెంగళూరు వాసులు!

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 09:07 PM

అప్పుల్లో మునుగుతున్న బెంగళూరు వాసులు!

అప్పులెక్కువ తీసుకోవడంలో ఐటీ హబ్ బెంగళూరు, ఆర్థిక రాజధాని ముంబైని బీట్ చేసింది. ఇండియాలో అత్యధిక హోమ్ లోన్, పర్సనల్‌‌ లోన్‌‌ తీసుకున్న నగరంగా ముంబైని బెంగళూరు మించిపోయిందని తాజా మార్కెట్ రిపోర్ట్‌‌ వెల్లడించింది. 2019లో ఇండియాలో అత్యధిక హోమ్‌‌ లోన్‌‌ సైజు బెంగళూరులో రూ.2.2 కోట్లుగా ఉంది. ముంబైలో ఈ హోమ్‌‌ లోన్ సైజు రూ.2 కోట్లుగా ఉన్నట్టు బ్యాంక్‌‌బజార్ మనీమూడ్ 2020 రిపోర్ట్‌‌ తెలిపింది. అదేవిధంగా పర్సనల్ లోన్ సెగ్మెంట్‌‌లో కూడా బెంగళూరులోనే అత్యధికంగా రూ.34 లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నారు. యావరేజ్‌‌గా హోమ్ లోన్ సైజు బెంగళూరులో రూ.33.3 లక్షలుగా, ముంబైలో రూ.26.6 లక్షలుగా ఉన్నట్టు ఈ రిపోర్ట్ తెలిపింది. అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ప్రకారం, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో 2016తో పోల్చుకుంటే 2019లో సగటున ధరలు 11 శాతం పెరిగాయి. బెంగళూరు సర్జాపూర్‌‌‌‌ రోడ్‌‌ టాప్ 10 యాక్టివ్ రెసిడెన్షియల్ హాట్‌‌స్పాట్లలో ఆరో స్థానంలో ఉంది. ప్రాపర్టీ ధరలు భారీగా పెరుగుతుండటంతో, బెంగళూరు వాసులు మరింత ఎక్కువ కాలం వేచి చూడకుండా హోమ్‌‌ లోన్స్ పెట్టుకొని కొత్త ఇండ్లు తీసుకుంటున్నారని బ్యాంక్‌‌బజార్.కామ్ సీఎంఓ అపర్ణ మహేశ్ తెలిపారు. కేవలం పెద్ద మొత్తంలో లోన్స్ మాత్రమే కాకుండా.. ఎక్కువ సంఖ్యలో లోన్స్‌‌ తీసుకోవడం కూడా బెంగళూరు నుంచే నమోదవుతున్నట్టు పేర్కొన్నారు.





Untitled Document
Advertisements