ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు ఫైల్..

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 08:47 AM

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పోలీసు కేసు నమోదు అయ్యింది. ఇటీవల ఆయన టీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

అయితే సంగా రెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మెదక్, సంగారెడ్డి జిల్లాలలో మంత్రి హరీశ్‌రావును తిరగనీయనని, పోలీసులతో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అని కొన్ని అసభ్యపదజాలంతో మాట్లాడారని సత్యనారాయణ ఫిర్యాదు ఇవ్వడంతో జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.





Untitled Document
Advertisements