అమరావతిలో హై అలర్ట్

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 09:39 AM

ఏపీలో నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు కీలకంగా మారాయి. ఏపీ రాజధాని అమరావతి తరలింపుపై అసెంబ్లీ కీలక ప్రకటన వెలువడనున్న నేపధ్యంలో దానిని అడ్డుకోవాలని టీడీపీ గట్టిగా ప్రయత్నిస్తుంది. ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది.

అయితే ప్రభుత్వం కనుక రాజధాని తరలింపు ప్రకటన చేస్తే విశాఖను పరిపాలనా రాజధానిగా మారుస్తూ, కర్నూలులో హైకోర్ట్ ఏర్పాటు అవుతుంది. అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు అవుతాయి. అయితే సమావేశానికి ముందే ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ జరుపుకోనుంది. అందులో హైపవర్ కమిటీ రిపోర్టు, జీఎన్‌ రావు కమిటీ రిపోర్టు, బీసీజీ రిపోర్టులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే టీడీపీ అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవాలని పిలుపునివ్వడంతో అమరావతిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాజధాని గ్రామాలలో భారీగా పోలీసులు మోహరించడమే కాకుండా 144 సెక్షన్ కూడా అమలు చేశారు. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య రాజధానిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన జారీ చేస్తుందో చూడాలి మరీ.





Untitled Document
Advertisements