2,90,00000 స్కిల్డ్ ఎంప్లాయీస్ కావలెను...ఏఐ, రోబోటిక్స్ కే ఫుల్ డిమాండ్!

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 12:18 PM

2,90,00000 స్కిల్డ్ ఎంప్లాయీస్ కావలెను...ఏఐ, రోబోటిక్స్ కే 
ఫుల్  డిమాండ్!

మనదేశంలో సరైన స్కిల్స్ లేనందుకే మస్త్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయట. 2019లో రిక్రూట్ చేసుకుందామన్నా.. స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ దొరకకపోవడంతో ఏకంగా 53% కంపెనీల్లో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోయాయట. అంతేకాదు.. స్కిల్డ్ ఎంప్లాయీస్ కొరత రానురాను తీవ్రం కానుందని, 2030 నాటికి మనదేశంలో దాదాపు 2.90 కోట్ల ఖాళీలు ఏర్పడతాయని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ‘ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ)’ వెల్లడించింది. అన్ని రంగాల్లోనూ స్కిల్ గ్యాప్స్ ఏర్పడుతున్నాయని, అందుకే మంచి జాబ్ దొరకాలంటే ముందుగా స్కిల్స్ నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించింది. ప్రధానంగా ఆయా కంపెనీల్లో డేటాబేస్ స్పెషలిస్ట్, సిస్టమ్ ప్రోగ్రామర్, వెబ్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్ పోస్టులు ఎక్కువ మొత్తంలో ఖాళీగా ఉన్నాయని, ఈ ఉద్యోగాల్లో ఖాళీలు రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతాయని పేర్కొంది. ఏ జాబ్ కొట్టాలన్నా ముందుగా బేసిక్స్ పై దృష్టి పెట్టాలని డెలాయిట్ ఇండియా పార్ట్ నర్ అనింద్య మల్లిక్ చెప్తున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ పాత్ర పెరిగిందని, అందువల్ల సంబంధిత రంగాల్లో టెక్నాలజీ వాడకానికి సంబంధించిన బేసిక్స్​ను తెలుసుకోవడం ఇప్పుడు తప్పనిసరి అయిందని ఆయన వెల్లడించారు. ఫిన్–టెక్, ఆన్ లైన్ బ్యాంకింగ్ వంటి సర్వీసెస్ పెరిగిన నేపథ్యంలో ఫైనాన్సియల్ సర్వీసెస్​లో ఉద్యోగ అవకాశాలు పెరిగాయని, ఈ జాబ్స్ కొట్టాలంటే టెక్నాలజీ పై కనీస అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నారు. టెక్నాలజీతో పాటు కమ్యూనికేషన్, టీమ్ బిల్డింగ్ వంటి సాఫ్ట్ స్కిల్స్ కూడా అవసరమేనన్నారు. 2020లో డిజిటల్ లిటరసీ, రోల్ చేంజింగ్ స్కిల్స్ చాలా కీలకం అయ్యాయని షైన్.కామ్ సీఈఓ జైరస్ మాస్టర్ సూచిస్తున్నారు. ఆయా కంపెనీల్లో వాటి అవసరాలకు అనుగుణంగా డేటా అనలైజేషన్ స్కిల్స్ కూడా ఉద్యోగులకు అవసరమని చెప్తున్నారు. రోల్స్ ను చేంజ్ చేసుకోగలిగే కెపాసిటీ ఉన్న క్యాండిడేట్స్ కే ఇప్పుడు కంపెనీలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్ వంటి వాటికి 2020లో మరింత డిమాండ్ ఏర్పడుతుందని ఇక్సీడ్ సొల్యూషన్స్ సీఈఓ యోగితా తుల్సియానీ పేర్కొంటున్నారు. ప్రిడిక్టివ్ అనలైటిక్స్ పై పట్టు ఉన్నవారికి, ఏఐ, రోబోటిక్స్ పై అవగాహన ఉన్న క్యాండిడేట్లకు డిమాండ్ పెరుగుతోందని తెలిపారు. అంతేకాదు.. ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకుని, ఉద్యోగ బాధ్యతలను మరింత బాగా నిర్వర్తించేవాళ్ల కోసమే కంపెనీలు చూస్తున్నాయన్నారు.









Untitled Document
Advertisements