మిడిల్‌‌‌‌క్లాస్‌‌‌‌ ప్రజలు రిస్క్‌‌‌‌ తీసుకోకూడదు...లాంగ్‌‌‌‌టర్మ్‌‌‌‌ లోన్లు త్వరగా పూర్తి!

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 12:53 PM

మిడిల్‌‌‌‌క్లాస్‌‌‌‌ ప్రజలు రిస్క్‌‌‌‌ తీసుకోకూడదు...లాంగ్‌‌‌‌టర్మ్‌‌‌‌ లోన్లు త్వరగా పూర్తి!

వడ్డీ భారం నుంచి తప్పించుకోడానికి లాంగ్‌‌‌‌టర్మ్‌‌‌‌ లోన్లను త్వరగా తీర్చేయాలన్నది చాలా మంది ఆర్థిక సలహాదారులు చెప్పే సలహా. ఒక దశాబ్దం తరువాత ఆదా చేసే వడ్డీతో ఇప్పుడు ఆదా చేయగల వడ్డీని పోల్చిచూసి ఇలాంటి సూచన చేస్తారు. తక్కువ వడ్డీ ఉండే హౌజింగ్‌‌‌‌ వంటి లోన్లను త్వరగా కట్టేస్తూ ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన పర్సనల్‌‌‌‌ లోన్లను ఆలస్యం చేస్తే లాభానికి బదులు నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా చేయడానికి బదులు అప్పు నికర వ్యయాన్ని పోల్చిచూసి, పన్నుల విలువను లెక్కించి నిర్ణయం తీసుకోవడం మంచిదని గెట్టింగ్‌‌‌‌ యూ రిచ్‌‌‌‌ ఫౌండర్‌‌‌‌, సీఈఓ రోహిత్‌‌‌‌ షా అన్నారు. ‘‘పన్ను ప్రయోజనాలను కూడా కలిపి చూసుకుంటే హౌజింగ్‌‌‌‌ లోన్లపై వడ్డీ ఆరుశాతం దాటదు (30 శాతం ట్యాక్స్‌‌‌‌ బ్రాకెట్‌‌‌‌ వాళ్లు). అందుకే పర్సనల్‌‌‌‌ లోన్లను త్వరగా తీర్చేయాలి’’ అని ఆయన అన్నారు. చాలా మంది ఫైనాన్షియల్‌‌‌‌ అడ్వైజర్లు చెప్పే మాట ఇది! రిస్క్‌‌‌‌కు దూరంగా ఉంటేనే నష్టాలు ఎక్కువని చాలా సందర్భాల్లో నిరూపితమయింది. మిడిల్‌‌‌‌క్లాస్‌‌‌‌ ప్రజలకు సహజంగానే ఆదాయం తక్కువ. కాస్త ఆదాయం ఉన్నప్పుడే దానిని వీలైనంత పెంచాలి. ఈ దృష్టితో చూస్తే వేరేరకంగా ఆలోచించమంటున్నారు ఇన్వెస్ట్​మెంట్​ గురూలు. రిస్క్‌‌‌‌కు దూరంగా ఉండటం అంటే మన టార్గెట్లకు దూరం కావడమనే అర్థం. ఆదాయంలో కొంత భాగాన్ని అయినా ఈక్విటీ వంటి గ్రోత్‌‌‌‌ అసెట్స్‌‌‌‌లో పెట్టాలి. ద్రవ్యోల్బణం వల్ల సాధారణ డెట్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లతో వచ్చే లాభం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఎక్కువ డబ్బు ఉన్న వాళ్లు డెట్‌‌‌‌లోనే డబ్బును పొదుపు చేయవచ్చు. ఉదాహరణకు ఒక మిడిల్‌‌‌‌క్లాస్‌‌‌‌ కుటుంబానికి 20 ఏండ్ల తరువాత రూ.25 లక్షలు అవసరం అనుకుందాం. సంపన్నులు రూ.25 లక్షలు ఇన్వెస్ట్‌‌‌‌ చేస్తే 20 ఏళ్లలో రూ.80 లక్షలు వస్తాయి. మిడిల్‌‌‌‌క్లాస్‌‌‌‌ ప్రజలు ఇంత పొదుపు చేయలేరు కాబట్టి నెలకు రూ.15 వేలు సేప్‌‌‌‌ చేస్తే ఈ టార్గెట్‌‌‌‌ను చేరుకోవచ్చు. సిస్టమాటిక్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ప్లాన్స్‌‌‌‌ (సిప్‌‌‌‌)లు ఎంతో సురక్షితమని, రిస్క్‌‌‌‌ అసలు ఉండనే ఉండదని మ్యూచువల్‌‌‌‌ ఫండ్‌‌‌‌ కంపెనీలు చెబుతుంటాయి. ‘‘సిప్‌‌‌‌ ఒక సాధనం కాదు.. ప్రొడక్ట్‌‌‌‌ మాత్రమే. ఇది రిస్క్‌‌‌‌ను పూర్తిగా తొలగించదు. ఇది డెట్‌‌‌‌, ఈక్విటీ, గోల్డ్‌‌‌‌ రూపంలో ఉంటుంది. ఈక్విటీల్లో 20 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌‌‌‌ చేస్తే మంచి, చెడు, మిశ్రమ.. ఫలితాలు కనిపించవచ్చు’’ అని ఒక గురు అన్నారు. అయితే మెజారిటీ ఇన్వెస్టర్లకు మంచి రాబడులే వస్తున్నాయని తెలిపారు. సుదీర్ఘకాలంపాటు స్టాక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ బాగా లేకపోతే లాంగ్‌‌‌‌టర్మ్‌‌‌‌ సిప్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లకూ నష్టాలు తప్పవన్నారు. రిటైర్‌‌‌‌మెంట్‌‌‌‌ తరువాత ఆర్థిక అవసరాల కోసం చర్చోపచర్చలు జరుగుతాయి కాబట్టి రిటైర్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్లాన్ అంటే మొత్తం డబ్బు గురించే అనే అపోహ ఏర్పడుతుంది. రిటైర్‌‌‌‌మెంట్‌‌‌‌ కార్పస్‌‌‌‌ను పెంచుకోవడంపైనే దృష్టి పెడతారు తప్ప అది కూడా వేగంగా ఖర్చవుతుందనే విషయాన్ని పట్టించుకోరు. శ్రద్ధ చూపాల్సిన ఇతర విషయాలను వదిలేస్తారు. ‘‘రిటైర్‌‌‌‌మెంట్‌‌‌‌ తరువాత దాదాపు కనీసం 30 ఏళ్ల జీవితం ఉంటుంది. పాత హాబీలను తిరిగి మొదలుపెట్టడం, స్నేహితులను పెంచుకోవడం, సేవా కార్యక్రమాలను చేపట్టడం వంటివి చాలా ముఖ్యం’’ అని జోషి అనే ఎనలిస్టు అన్నారు. ఆర్థికేతర అంశాలపై రిటైర్డ్‌‌‌‌ ఉద్యోగులు దృష్టి పెట్టాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడమూ ముఖ్యమేనని అన్నారు. అన్ని వివరాలూ ఉంటేనే ఫ్యామిలీ బడ్జెట్‌‌‌‌ను తయారు చేసుకోవాలని, లేకపోతే వదిలేయడమే మేలన్నది చాలా మంది నమ్మకం. ‘ఇలాంటి ఆలోచన చాలా తప్పు. ప్రతి చిన్న అంశాన్ని రాసుకోవాల్సిన అవసరం లేదు’ అని మరో ఇన్వెస్ట్​మెంట్​ గురు అన్నారు. ‘ఖర్చులు’, ‘చెల్లింపులు’, ‘సేవింగ్స్‌‌‌‌, ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌’ అనే మూడు శీర్షికలతో బడ్జెట్‌‌‌‌ను తయారు చేసుకోవచ్చు. లోన్లు వంటివి లేని వాళ్లకు చెల్లింపుల కాలమ్‌‌‌‌ ఖాళీగా ఉంటుంది. ‘‘టెలిఫోన్‌‌‌‌, కరెంటు, గ్యాస్‌‌‌‌ బిల్స్‌‌‌‌ వంటి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే చెల్లించవచ్చు కాబట్టి వాటిని రాయడం సులువు. కిరాణా సామగ్రి, ఇతర ఖర్చులకూ క్రెడిట్‌‌‌‌కార్డు ద్వారా చెల్లించవచ్చు వాటి ఖర్చులను కూడా సులువుగా గుర్తించవచ్చు. రెస్టారెంట్లలో తినడం, సినిమాలకు వెళ్లడంపై ఎంత ఖర్చు చేయాలనేది భార్యాభర్తలు నిర్ణయించుకోవాలి. అనుకోకుండా వచ్చే ఖర్చుల కోసం కొంతమొత్తాన్ని పక్కనబెట్టాలి’’ అని శఠగోపన్‌‌‌‌ అనే ఫైనాన్స్‌‌‌‌ ప్లానర్‌‌‌‌ అన్నారు. బడ్జెట్‌‌‌‌ ప్రకారం ఖర్చులను కంట్రోల్​ చేసుకోలేకపోతే దీర్ఘకాలిక టార్గెట్లను చేరుకోలేమని చాలా మంది అంటుంటారు. అయితే కొన్ని నెలల్లో ఖర్చులు పెరిగిపోవడం సర్వసాధారణమని, ఇలాంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదని ఎక్స్​పర్టులు అంటున్నారు. దుబారా చేయకుంటే చాలన్నారు. ఉదాహరణకు మీకు హఠాత్తుగా స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ కొనాలనిపించింది. ఇది కొన్నందుకు.. ఇయర్‌‌‌‌ ఎండ్‌‌‌‌లో వెళ్లాల్సిన హాలిడేట్రిప్‌‌‌‌ను రద్దు చేసుకున్నారు. ఇలాంటి సందర్భాల్లో సమస్య ఏమీ ఉండదు. అయితే చిన్నారుల ఎడ్యుకేషన్‌‌‌‌ కోసం దాచిన డబ్బును హాలిడే కోసం వాడితే మాత్రం చిక్కులు తప్పవు. బంధువుల పెళ్లి కోసం కానుకల కోసం హఠాత్తుగా కొంత డబ్బు తీయాల్సి రావొచ్చు. ఇలాంటి అవసరాల కోసం కొంత డబ్బును ఎమర్జెన్సీ ఫండింగ్‌‌‌‌గా కేటాయించాలి. ఎమర్జెన్సీ ఫండింగ్‌‌‌‌లో ఉన్న డబ్బు కంటే ఎక్కువ కావాల్సి వస్తే.. సిప్‌‌‌‌ను కొన్ని నెలలపాటు ఆపేయవచ్చు. ఒకసారి ఫైనాన్షియల్‌‌‌‌ అడ్వైజర్‌‌‌‌ను నియమించుకుంటే ఆయనే అన్ని చూసుకుంటాడని ఇన్వెస్టర్లు భరోసాతో ఉంటారు. ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను ప్రారంభించడంతో అడ్వైజర్‌‌‌‌ సాయపడతాడు. మిగతాది అంతా మనమే చూసుకోవాలి. రిస్కులను భరించాలా వద్దా ? అనేది మనమే నిర్ణయించుకోవాలి.

















Untitled Document
Advertisements