బెట్టింగ్ ఉచ్చులో చిక్కిన పిల్లలను ఇలా కనిపెట్టొచ్చు?!

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 12:58 PM

బెట్టింగ్ ఉచ్చులో చిక్కిన పిల్లలను ఇలా కనిపెట్టొచ్చు?!

మెట్రోపాలిటన్ సిటీల నుండీ, చిన్నచిన్న టౌన్ ల వరకే కాకుండా, పల్లె ప్రాంతాలకూ ఈ బెట్టింగ్ భూతం పాకేసింది. 2007లో ఐపీఎల్ మొదలైనప్పటి నుండీ దీని ప్రభావం మరింత పెరుగుతూ వచ్చింది. మొదట ఈ వ్యవహారం సీక్రెట్ గా జరిగేది. దీనిలో ఇన్వాల్వ్ అయ్యే వాళ్లు అంత ఎక్కువగా ఉండేవాళ్లు కాదు. ఇప్పుడు కాలేజ్ పిల్లల, టీనేజ్ పిల్లలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయారు. బెట్టింగ్ అలవాటుగా, అడిక్షన్ గా మారిపోతోంది. ఆన్ లైన్ బెట్టింగ్ సైట్ లు ఎన్నో ఉన్నప్పటికీ, ఇండియాలో ఆఫ్ లైన్ బెట్టింగ్ జోరే ఎక్కువగా ఉంది. లోకల్ బుకీల ద్వారానే ఎక్కువగా గ్యాబ్లింగ్ నడుస్తోంది. తొలిదశలోనే దీన్ని తల్లిదండ్రులు గమనిస్తే ఆ వ్యసనం నుంచి పిల్లల్ని కాపాడుకోవచ్చు. మన లాంటి దేశాల్లో బెట్టింగ్ లీగల్ కాదు. ఆన్ లైన్ బెట్టింగ్ అయినా, ఆఫ్ లైన్ బెట్టింగ్ అయినా అనఫీషియల్ గా జరగాల్సిందే. అయితే ఆన్ లైన్ బెట్టింగ్ తో రిస్క్ ఎక్కువ. అంతే కాకుండా ఎన్నో సైట్స్ కు మనకు యాక్సెస్ ఉండదు. ఒకవేళ ఉన్నా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తో సైబర్ పోలీసులకు దొరకిపోయే అవకాశం ఉంది. అందుకే ఎక్కువ మంది ఆఫ్ లైన్ బెట్టింగ్ చేసేందుకే ఆసక్తి చూపిస్తారు. ఆన్ లైన్ బెట్టింగ్ తో పోల్చుకుంటే ఇందులో రిస్క్ తక్కువగా ఉన్నట్టు భావిస్తున్నారు. అంతే కాకుండా ఆఫ్ లైన్ బుకీలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు. ఇప్పుడు యువత ప్రధానంగా వీళ్ల ట్రాప్ లో పడే క్రికెట్ బెట్టింగ్ లోకి ఎంటర్ అవుతోంది. అయితే కొద్ది మంది యువత రిస్క్ ను పక్కన పెట్టి మరీ, ఆన్ లైన్ బెట్టింగ్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. వీళ్లు ‘Bet365, 1Xbet, Betway, 888Sport, Betrally’ వంటి సైట్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పిల్లల మొబైల్ లో ఇలాంటి యాప్స్ కనిపిస్తే వెంటనే అలర్ట్ అయిపోవాలి. ఇవన్నీ విదేశీ బెట్టింగ్ సంస్థలు. ఒకప్పుడు వీటి ద్వారా బెట్టింగ్ చేసేందుకు ఇండియన్స్ కు అనుమతి లేదు. ఇప్పుడు ఆ సంస్థలేవీ నియమాలను పాటించడం లేదు. మనకూ పర్మిషన్ ఇస్తోంది. దీంతో బెట్టింగ్ కి బానిసలవ్వడమే కాకుండా, సైబర్ పోలీసులకు దొరికితే ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితులూ వస్తాయి. ఆఫ్ లైన్ బెట్టింగ్ అంతా బుకీల ద్వారానే నడుస్తుంది. ఆన్ లైన్ బెట్టింగ్ జరిగినట్టుగానే ఇందులోనూ బెట్టింగ్ కు రకరకాల ఆప్షన్స్ఉం టాయి. మ్యా చ్ ఎవరు విన్ అవుతారు? ప్రతి 5 ఓవర్లకూ ఎన్ని పరుగులు చేస్తారు? ఇన్నింగ్స్ మొత్తానికీ ఎన్ని పరుగులు చేస్తారు?… ఇలాంటి వాటిపై బెట్టింగ్ జరుగుతుంది. వీటికోసం కొన్ని ప్రత్యేకమైన పదాలను వాడుతారు. ‘ఈటింగ్ , ఫేవర్ , యస్ , నో , ల్యా క్ ఇన్ త్రీ ’ ఈ పదాలు బెట్టింగ్ వేసేప్పుడు తరుచూ వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పదాలను పిల్లలు ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు విం టే మాత్రం కచ్ఛితంగా వాళ్ల మీద ఒక కన్నేసి ఉంచాలి. వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారనే విషయాన్ని కన్ ఫర్మ్ చేసుకోవాలి. మ్యా చ్ జరుగుతున్నప్పుడే ఈ బెట్టింగ్ ఎక్కువ ఉంటుంది. మనకు తెలియకుండా పిల్లల చేతుల్లోకి కొత్త గాడ్జెట్స్ వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా ఆలోచనలో పడాలి. అది వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. ఫ్రెండ్ ది వాడుతున్నట్టు చెప్తే, వెంటనే ఆ విషయం నిజమో కాదో తేల్చుకోవాలి. అది వారు సొంతంగా కొనుకు న్నట్టయితే మాత్రం…వాళ్లు ఈజీ మనీకి అలవాటు పడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. బెట్టింగ్ లాంటి వ్యసనాలకూ దగ్గరగా ఉన్నట్టే అనుకోవాలి. ఇలాంటి సమయంలో వాళ్లని మరింత దగ్గరగా గమనించాలి. బెట్టింగ్ చేస్తున్నట్టు తేలితే మాత్రం… వాళ్ల మీద కోప్పడకూడదు. దాంతో ఆ అలవాటు మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. దాంట్లో ఉన్న తప్పుల గురించీ, ఎదురయ్యే ఇబ్బందుల గురుంచీ వాళ్లకి వివరించాలి. దగ్గర్లోని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళడమూ
అవసరమే. ఇలాంటి విషయాలను ముందుగానే గమనించి జాగ్రత్తపడితే పిల్లల జీవితాలు హాయిగా ఉంటాయి.





Untitled Document
Advertisements