విజయ్ @10 మూవీ స్టార్ట్!

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 01:05 PM

విజయ్ @10 మూవీ స్టార్ట్!

డైరెక్టర్ పూరి జగన్నాథ్ , రౌడీ విజయ్ దేవర కొండ కాంబినేషన్ లో కొత్త మూవీ స్టార్ట్ అయ్యింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ పూజ కార్యక్రమం ఇవాళ ముంబైలో జరిగింది. నటి చార్మి విజయ్ పై క్లాప్ కొట్టి ప్రారంభించారు. హిందీ, సౌత్ ఇండియాలోని అన్నిభాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. పూరి జగన్నాథ్, ఛార్మి, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రారంభించిన ఫోటోలు,వీడియో చార్మి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ మూవీ టైటిల్ ప్రస్తుతం ఫైటర్ అనుకుంటున్నారు. ఇంకా టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేయలేదు. విజయ్ దేవర కొండకు ఈ మూవీ 10వ సినిమా కాగా పూరిజగన్నాథ్ కు 37 వ సినిమా. అయితే ఈ మూవీకి హీరోయిన్ ను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రేదేవి కూతురు జాన్వీ కపూర్ ను తీసుకుంటారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. కానీ లేటెస్ట్ గా బాలీవుడ్ నటి అనన్య పేరు ప్రచారంలో ఉంది. వీరిలో ఎవరిని తీసుకుంటారనేది చూడాలి మరి.





Untitled Document
Advertisements