SBI vs HDFC vs ICICI vs AXIS...ఏ బ్యాంక్‌‌లో ఎక్కువ వడ్డీ?

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 01:14 PM

SBI vs HDFC vs ICICI vs AXIS...ఏ బ్యాంక్‌‌లో ఎక్కువ వడ్డీ?

బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో బ్యాంకులు ఉన్నాయి. ఎందులో డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలో అర్థం కావడం లేదా? మీ డబ్బుకు ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ వస్తుందో తెలుసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకోసమే ఈ ఆర్టికల్.

*ఎస్‌బీఐ:

దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఇటీవల ఎఫ్‌డీ రేట్లు తగ్గించింది. 15 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. ఇప్పుడు ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 4.5 శాతం నుంచి 6.10 శాతం మధ్యలో ఉంది. ఇది సాధారణ కస్టమర్లకు వర్తిస్తుంది. అదే సీనియర్ సిటిజన్లకు 5 శాతం నుంచి 6.6 శాతం మధ్యలో వడ్డీ లభిస్తుంది.

*ఐసీఐసీఐ:

ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4 శాతం నుంచి ప్రారంభమౌతోంది. 7 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై 5.75 శాతం వడ్డీ పొందొచ్చు. ఏడాది నుంచి 10 ఏళ్ల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 6.2 శాతం నుంచి 6.4 శాతం మధ్యలో వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు వడ్డీ రేటు 4.5 శాతం నుంచి 6.9 శాతం మధ్యలో లభిస్తుంది.

*హెచ్‌డీఎఫ్‌సీ:

ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 3.5 శాతం నుంచి ప్రారంభమౌతోంది. గరిష్టంగా 6.3 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. ఇది సాధారణ కస్టమర్లకు వర్తిస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 4 శాతం నుంచి 6.8 శాతం మధ్యలో వడ్డీ రేటు లభిస్తుంది.

*యస్ బ్యాంక్‌:

ప్రైవేట్ రంగానికి చెందిన మరో ప్రముఖ బ్యాంక్ యస్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 5 శాతం నుంచి ప్రారంభమౌతోంది. గరిష్టంగా 7.25 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. అదే సీనియర్ సిటిజన్స్ అయితే 5.5 శాతం నుంచి 7.75 శాతం మధ్యలో వడ్డీ రేటు సొంతం చేసుకోవచ్చు.

*యాక్సిస్ బ్యాంక్:

యాక్సిస్ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 3.5 శాతం నుంచి ప్రారంభమౌతోంది. ఎఫ్‌డీలపై గరిష్టంగా 6.5 శాతం వరకు వడ్డీ రేటు పొందొచ్చు. ఇది సాధారణ కస్టమర్లకు వర్తిస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే యాక్సిస్ బ్యాంక్‌లో 3.5 శాతం నుంచి 7.3 శాతం మధ్యలో వడ్డీ వస్తుంది.





Untitled Document
Advertisements