ఫోన్ రిచార్జితో లైఫ్ ఇన్సూరెన్స్ రూ.2 లక్షల వరకు కవరేజ్!

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 01:58 PM

ఫోన్ రిచార్జితో లైఫ్ ఇన్సూరెన్స్ రూ.2 లక్షల వరకు కవరేజ్!

భారతీ ఎయిర్‌‌‌‌టెల్ తన యూజర్లకు వినూత్న ఆఫర్‌‌‌‌ ప్రకటించింది. ప్రతి రూ.179 ప్రీపెయిడ్ రీఛార్జ్‌‌ ప్లాన్‌‌పై యూజర్లకు రూ.2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్‌‌ను అందించనున్నట్టు ఎయిర్‌‌‌‌టెల్ తెలిపింది. భారతీ ఆక్సాలైఫ్‌‌ ఇన్సూరెన్స్‌‌తో భాగస్వామ్యమై ఎయిర్‌‌‌‌టెల్ ఈ కవరేజ్‌‌ను అందిస్తుంది. గతేడాది నవంబర్‌‌‌‌లోనే ఎయిర్‌‌‌‌టెల్, భారతీ ఆక్సాలైఫ్‌‌ ఇన్సూరెన్స్‌‌తో జతకట్టింది. ఢిల్లీ పరిసర ప్రాంత యూజర్లకు రూ.599 రీఛార్జ్‌‌పై రూ.4 లక్షల కవరేజ్‌‌ను ఆఫర్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌‌‌‌టెల్ యూజర్లకు ఇన్సూరెన్స్‌‌ కవరేజ్ అందించడం కోసం మోస్ట్ అఫర్డబుల్‌‌ ప్లాన్‌‌కు దీన్ని ఆఫర్ చేస్తున్నామని ఎయిర్‌‌‌‌టెల్ తెలిపింది. రూ.179 రీఛార్జ్ ప్లాన్‌‌పై ఎయిర్‌‌‌‌టెల్ కస్టమర్లు ఏ నెట్‌‌వర్క్‌‌కైనా 28 రోజుల పాటు అపరిమిత కాల్స్‌‌ చేసుకోవచ్చు. 2జీబీ డేటా, 300 ఎస్‌‌ఎంఎస్‌‌లను అందిస్తోంది. తమ ఇన్నోవేటివ్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌‌ను ఇన్సూరెన్స్ ప్లాన్స్‌‌తో తీసుకురావడంపై కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోందని భారతీ ఎయిర్‌‌‌‌టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సశ్వంత్ శర్మ తెలిపారు. ఇదే తమల్ని మరింత మందికి ఈ సేవలను అందించేలా ప్రోత్సహిస్తోందన్నారు. రూ.179 రీఛార్జ్ ఆఫర్‌‌‌‌.. లక్షల మంది యూజర్లకు తేలికగా అందుబాటులో ఉండే ప్లాన్ అని తెలిపారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఇండియాలో ఇన్సూరెన్స్ పెనట్రేషన్‌‌ 4 శాతం కంటే తక్కువగా ఉంది. ఇదే సమయంలో మొబైల్ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో, మొబైల్ ఆపరేటర్లు, ఫైనాన్సియల్ సర్వీస్ ప్రొవైడర్లు కలిసి ఇండియన్లకు ఫైనాన్సియల్ సెక్యురిటీ అవసరాలను తీర్చడమే కాకుండా.. ప్రభుత్వ ఫైనాన్సియల్ ఇన్‌‌క్లూజిన్ విజన్‌‌కు సాయం చేయాలని నిర్ణయించినట్టు ఎయిర్‌‌‌‌టెల్ తెలిపింది. భారతీ ఎయిర్‌‌‌‌టెల్‌‌తో భాగస్వామ్యం కావడం ఆనందదాయకంగా ఉందని, తమ కస్టమర్లకు లైఫ్ ఇన్సూరెన్స్‌‌తో ప్రొటక్షన్ కల్పిస్తామని భారతీ ఆక్సాలైఫ్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌ సీఈవో, ఎండీ వికాస్ సేఠ్‌‌ తెలిపారు. ఇన్సూరెన్స్‌‌ కవరేజ్‌‌ 18 నుంచి 54 ఏళ్ల వయసున్న కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఎలాంటి పేపర్ వర్క్ లేదా మెడికల్ టెస్ట్ అవసరం ఉండదు. ఈ మొత్తం ప్రాసెస్‌‌ ఏదేనీ ఎయిర్‌‌‌‌టెల్ రిటైల్ స్టోర్ లేదా ఎయిర్‌‌‌‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా క్షణాల్లో పూర్తవుతుంది. ఎయిర్‌‌‌‌టెల్‌‌కు ప్రస్తుతం 10 లక్షల రిటైల్ ఔట్‌‌లెట్లు ఉన్నాయి.







Untitled Document
Advertisements