ఇంట్లో వంటలకి గుడ్ బై...బయటి ఫుడ్డే బెట్టర్ అంటున్న జనం!

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 02:17 PM

ఇంట్లో వంటలకి గుడ్ బై...బయటి ఫుడ్డే బెట్టర్ అంటున్న జనం!

రోజూ రెండు పూటలు వండేది పొయి.. రోజుకో పూటన్నా బయటికి నుంచి తెచ్చుకుని తినుడో, బయటికే పొయి తినుడో ఎక్కువైతున్నది. హైదరాబాద్, వరంగల్​ అసొంటి పెద్ద పెద్ద పట్నాల నుంచి చిన్న టౌన్లు, మండల కేంద్రాల దాకా ఇదే అలవాటుగ మారింది. పొద్దున టిఫిన్​ సెంటర్ల ముందు, మధ్యాహ్నం లంచ్​ బండ్ల దగ్గర, సాయంత్రం హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద జనం కిక్కిరిసి కనిపిస్తున్నరు. జనం ఈ తీర్న తింటుండటంతో గల్లీగల్లీల్లో టిఫిన్​ సెంటర్లు, ప్రతి జంక్షన్​లో నాలుగైదో హోటళ్లు, రెస్టారెంట్లు వెలిసినయి. పెద్ద సిటీల్లో ఆన్​లైన్​ఫుడ్​ డెలివరీ యాప్స్​లో లక్షల కొద్దీ ఆర్డర్లు వస్తున్నయి. ఒక్క మన రాష్ట్రంలోనే పొద్దున చాయ్‌‌‌‌ నుంచి రాత్రికి బిర్యానీ దాకా బయటి ఫుడ్ కోసం రోజుకు రూ.80 కోట్ల నుంచి వంద కోట్ల దాకా ఖర్చు పెడుతున్నరు. ఏడాదికి రూ. 35 వేల కోట్ల దాకా తినేస్తున్నరు. ఈ బయటి తిండి అలవాటు ఏటేటా పెరుగుతున్నదని.. ఇండియాలో బయటి ఫుడ్​తినడం 2018తో పోలిస్తే 2019లో ఐదింతలు ఎక్కువైందని ఇటీవల ‘డైన్ ఔట్’ పేరుతో విడుదలైన ఓ సర్వే స్పష్టం చేసింది. శని, ఆదివారాల్లో బయటికి వెళ్లి తినడం ఓ ఫ్యాషన్‌‌‌‌గా మారింది. ఉద్యోగాలు చేసేవాళ్లే కాదు బిజినెస్​ చేసుకునేవాళ్లు, దుకాణాల వాళ్లూ ఈ రెండు రోజులు ఇండ్లలో వంటలు బంద్​ పెట్టేశారు. సినిమాలకో, పార్కులకో, షాపింగ్‌‌‌‌కో పోయి సేద తీరడం, కొత్త కొత్త హోటళ్లు, రెస్టారెంట్లను వెతుక్కుని మరీ ఫుడ్​ టేస్ట్​చేయడం పెరిగింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్​ వంటి పెద్ద సిటీల్లో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. పెద్ద సిటీలతోపాటు చిన్న టౌన్ల వరకు కర్రీ పాయింట్లు వేల సంఖ్యలో ఏర్పాటయ్యాయి. 15, 20 వెరైటీల కర్రీలను అమ్ముతుండటంతో జనం వాటి వెంట పడుతున్నారు. మధ్యాహ్నం తక్కువ ధరకే భోజనం అందించే టెంపరరీ దుకాణాలు, లంచ్ బండ్లు బాగా పెరిగాయి. 50 నుంచి 100 మందికి సరిపోయేలా ఇంటి వద్దే వండుకుని, జనాలు ఎక్కువగా ఉండే చోట ‘లంచ్‌‌‌‌ అడ్డా’లు పెడ్తున్నారు. ఆఫీసులు, ఆటో స్టాండ్లు, లేబర్ అడ్డాలు, మార్కెట్లలో ఈ లంచ్ అడ్డాలకు మస్తు డిమాండ్ ఉంది. రూ.40 నుంచి రూ. 60 వరకు వెజ్‌‌‌‌ మీల్స్, ఇంకో పదీ ఇరవై ఎక్కువ రేటు పెట్టి చికెన్ తో మీల్స్​ పెడ్తున్నారు. హైదరాబాద్​తోపాటు పెద్ద జిల్లా కేంద్రాల్లో రూముల్లో ఉండి చదువుకునే స్టూడెంట్లు, ఉద్యోగులు ఈ లంచ్​ అడ్డాల్లో తింటున్నారు. స్విగ్గీ, జొమాటో, ఉబర్​ ఈట్స్​ వంటి ఆన్‌‌‌‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్‌‌‌‌ కారణంగా బయటి ఫుడ్‌‌‌‌ను జనాలకు మరింత దగ్గరైంది. బుక్​ చేసిన అరగంటలోనే ఫుడ్​ను ఇంటికే తెచ్చిస్తుండటంతో చాలా మంది దీనికి అలవాటవుతున్నరు. ఒక్క హైదరాబాద్‌‌‌‌లోనే రోజుకు సగటున ఆరేడు లక్షల ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఫుడ్ ఆర్డర్లు వస్తున్నయి. వరంగల్, కరీంనగర్‌‌‌‌‌‌‌‌ వంటి టౌన్లలోనూ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఫుడ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక చిన్న పట్టణాల్లోనూ రెస్టారెంట్లు, హోటళ్ల వాళ్లు హోం డెలివరీ అందుబాటులోకి తెచ్చారు. కాల్​ చేసిగానీ, వాట్సాప్​లోగానీ ఆర్డర్​ చేస్తే.. ఇంటికే ఫుడ్​ తెచ్చిస్తున్నారు. టిఫిన్ సెంటర్లు, ఫుడ్ వ్యాన్​ల వ్యాపారం పెరిగింది. మూడేండ్లలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు వేల సంఖ్యలో టిఫిన్ సెంటర్లు, ఫుడ్‌‌‌‌ వ్యాన్​లు, బిర్యానీ సెంటర్లు స్టార్ట్ అయినయి. గ్రామాల్లోనూ పొద్దున బయటకెళ్లి టిఫిన్ చేసే కల్చర్ పెరిగింది. నగరాల్లో ఉండే స్టూడెంట్లు, ఉద్యోగులు రోజూ పొద్దున్నే టిఫిన్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో టిఫిన్ల వ్యాపారమే రోజుకు రూ.10 కోట్లకుపైగా జరుగుతున్నట్టు అంచనా. హైదరాబాద్‌‌‌‌లో అర్ధరాత్రి కూడా రోడ్‌‌‌‌ సైడ్ టిఫిన్ సెంటర్లు కిటకిటలాడుతూ కనిపిస్తాయి.















Untitled Document
Advertisements