డ్యూటీ ఫ్రీ ఆల్కాహాల్‌‌ పై పరిమితులు!

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 02:52 PM

డ్యూటీ ఫ్రీ ఆల్కాహాల్‌‌ పై పరిమితులు!

నిత్యావసరం కాని వస్తువుల దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోన్న క్రమంలో భాగంగా డ్యూటీ ఫ్రీ షాపుల నుంచి ట్యాక్స్ ఫ్రీ ఆల్కాహాల్‌‌ను కొనుగోలు చేయడంపై పరిమితి విధించబోతుంది. ట్యాక్స్ ఫ్రీ ఆల్కాహాల్‌‌ను కేవలం ఒక్కటే బాటిల్ కొనుగోలు చేసే వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. డ్యూటీ ఫ్రీ షాపుల్లో కొనుగోలు చేసే సిగరెట్ డబ్బాలపై నిషేధం విధించాలని కూడా కామర్స్ మినిస్ట్రీ పేర్కొంది. ఈ ప్రతిపాదనలను కేంద్రం త్వరలో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ ప్రపోజల్స్‌‌లో తెలిపింది. ప్రస్తుతం డ్యూటీ ఫ్రీ షాపుల నుంచి రెండు లీటర్ల ఆల్కాహాల్, సిగరెట్ డబ్బాలను కొనుగోలు చేసేందుకు ఇన్‌‌బౌండ్ ఇంటర్నేషనల్ ప్యాసెంజర్లకు అవకాశం ఉంది. సంబంధిత వర్గాల ప్రకారం కొన్ని దేశాలు కేవలం లీటరు లిక్కర్‌‌‌‌ ను మాత్రమే ఇంటర్నేషనల్ ప్యాసెంజర్లకు అనుమతి ఇస్తున్నాయి. ఈ విధానాన్నే ఇండియాలో కూడా అమలు చేయనున్నారు. దేశంలోకి అనవసరమయ్యే వస్తువుల దిగుమతులను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సంబంధిత వర్గాలు చెప్పాయి. దీంతో వాణిజ్య లోటు నుంచి బయటపడాలనుకుంటున్నట్టు తెలిపాయి.





Untitled Document
Advertisements