బూతు సినిమాలు చూడటం తప్ప పెద్దగా పని ఏముంటుంది?

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 03:04 PM

బూతు సినిమాలు చూడటం తప్ప పెద్దగా పని ఏముంటుంది?

ఇంటర్నెట్‌తో ఏవో బూతు సినిమాలు చూడటం తప్ప పెద్దగా పని ఏముంటుంది? అంటూ నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్‌ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్‌ నిషేధం సబబేనని ఆయన అభిప్రాయపడ్డారు. 370 ఆర్టికల్‌ నిర్వీర్యం నేపథ్యంలో ఇంటర్నెట్‌ సేవల నిలిపివేత ప్రభావం ఆర్థికరంగంపై ఎంత మాత్రం లేదన్నారు.

శాంతిభద్రతలకు భంగం కలిగించేలా కొన్ని శక్తులు ఆ సేవలను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే ఆంక్షలు విధించారని చెప్పుకొచ్చారు. ధీరూబాయి అంబానీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్నాతకోత్సవానికి హాజరైన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘ఇంటర్నెట్‌ సేవల నిలిపివేతతో అక్కడ(కశ్మీర్‌) ఏం మునిగిపోయింది? ఇంటర్నెట్‌తో అక్కడేం చేశారు? ఏవో బూతు సినిమాలు చూడటం తప్ప..’ అని సారస్వత్‌ అన్నారు. ఆయన వ్యాఖ్యలను కశ్మీర్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ర్టీ తీవ్రంగా ఖండించింది. వివాదం ము దరడంతో అనంతరం కశ్మీరీలకు సారస్వత్‌ క్షమాపణలు చె ప్పారు. మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందన్నారు.





Untitled Document
Advertisements