ఆవులకు స్పెషల్ లాంగ్వేజ్...అవి మాట్లాడుకుంటాయంట!

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 03:05 PM

ఆవులకు స్పెషల్ లాంగ్వేజ్...అవి మాట్లాడుకుంటాయంట!

ఆవులు ‘అంబా..’ అని అరవడమే గానీ అందులో మాటలేముంటయ్? అనుకుంటున్నారా! కానీ ఆ అరుపులే ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ అని యూనివర్సిటీ ఆఫ్​సిడ్నీ రీసెర్చర్లు చెప్తున్నారు. తమ దూడలను పిలవాలన్నా, తోటి ఎద్దులు, ఆవులను పలకరించాలన్నా, యజమానికి తన ఫీలింగ్ చెప్పుకోవాలన్నా ఆవుల ‘అంబా..’లో చాలా వేరియేషన్స్ ఉంటాయని యూనివర్సిటీ రీసెర్చర్ల టీంను లీడ్ చేసిన అలెగ్జాండ్రా గ్రీన్ వెల్లడించారు. ఆవుల ‘అంబా’ లాంగ్వేజ్ పై రీసెర్చ్ చేసిన తాము.. వాటి అరుపులను తెలియజేసేందుకు ‘గూగుల్ ట్రాన్స్ లేట్’ లాంటి పద్ధతినీ కనిపెట్టామని ఆమె అంటున్నారు. మనుషుల మాదిరిగానే ఆవుల వాయిస్ కూడా చాలా డిఫరెంట్​గా ఉంటుందని అలెగ్జాండ్రా తెలిపారు. ప్రతి ఆవుకూ వాయిస్ పిచ్ లో తేడాలుంటాయని చెప్పారు. అలాగే కోపం, బాధ, భయం, సంతోషం, ఎగ్జైట్ మెంట్ వంటి ఫీలింగ్స్ ను వెల్లడించేటప్పుడు, దూడలను, తోటి పశువులను పిలిచేటప్పుడూ వాటి అరుపుల్లో కచ్చితమైన తేడాలు కన్పిస్తాయని, అవి జీవితాంతం అలాగే కొనసాగుతాయని అన్నారు. 333 ఆవుల అరుపులను రికార్డ్ చేసి, అనలైజ్ చేయగా తమకు ఈ విషయాలు తెలిశాయన్నారు. ఒక మందలో ఏ ఆవు అరిచిందో చూడకుండా కేవలం వినడం ద్వారానే తాను గుర్తుపట్టగలననీ ఆమె వెల్లడించారు. ఒక్కో విషయం తెలియజేసేందుకు ఒక్కోలా అరుపు మారుతుంది కాబట్టి, ఆవులకు వాటి సొంత లాంగ్వేజ్ ఉన్నట్టేనని తేలిందన్నారు. అయితే ప్రతి ఆవుకూ ఓ డిఫరెంట్ వాయిస్, ఉంటుందని, అది జీవితాంతం కొనసాగుతుందని తమ రీసెర్చ్ లో కనుగొన్నట్టు అలెగ్జాండ్రా గ్రీన్​ తెలిపారు.







Untitled Document
Advertisements