ఏమాత్రం వెనక్కితగ్గని రాజధాని రైతులు!!

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 03:08 PM

ఏమాత్రం వెనక్కితగ్గని రాజధాని రైతులు!!

ఏపీ రాజధాని తరలింపుపై కొన్నివారాలుగా జరుగుతున్న ఆందోళనలు పతాకస్థాయికి చేరాయని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో, సభా సమావేశాలను, సచివాలయ కార్యకలాపాలను అడ్డుకునేందుకు రాజధాని ప్రజలు సమరోత్సాహంతో ముందుకు కదిలారు. భారీగా తరలివస్తున్న రైతులను అడ్డుకునేందుకు వేల సంఖ్యలో పోలీసులను మోహరించారు.

ఈ క్రమంలో, గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు రంగంలోకి దిగారు. రైతులంతా తమ గ్రామాలకు వెళ్లిపోవాలని హెచ్చరించారు. గ్రామాల్లో ఆందోళనలు చేసుకోవాలంటూ స్పష్టం చేశారు. అయితే, ఎస్పీ హెచ్చరికతో మరింత ఆవేశానికి లోనైన రైతులు 'జై అమరావతి' నినాదాలతో హోరెత్తించారు. సెక్రటేరియట్ సమీపంలోని పొలాల్లో బైఠాయించి నిరసనలు తెలిపారు. ఓ దశలో పరిస్థితి అదుపుతప్పుతున్నట్టు గ్రహించిన పోలీసు ఉన్నతాధికారులు విజయవాడ నుంచి హుటాహుటీన అదనపు బలగాలను రాజధాని ప్రాంతానికి రప్పించారు.





Untitled Document
Advertisements