పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ఫిక్స్

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 03:48 PM

పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ఫిక్స్

రాజకీయాల కారణంగా సినిమాలకు దూరమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. పింక్ రీమేక్ తో వెండితెర పునరాగమనం చేయనున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సరసన పూజా హెగ్డే కనిపించనుందని వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన కోర్టు సెట్లో షూటింగ్ ను ఈ రోజు (సోమవారం) ప్రారంభించారు. త్వరలోనే పవన్ షూటింగ్ కు హాజరవుతారని సమాచారం. ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాకు `లాయర్ సాబ్` అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. రంజాన్ సందర్బంగా మే 23న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోందట.





Untitled Document
Advertisements