రబాడపై నిషేధం సరికాదు: ఆసీస్ మాజీ బౌలర్

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 04:03 PM

రబాడపై నిషేధం సరికాదు: ఆసీస్ మాజీ బౌలర్

ఐసీసీ నిర్ణయంపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ నిప్పులు చెరిగాడు. ఏకపక్షంగా సౌతాఫ్రికా బౌలర్ కగిసో రబాడపై నిషేధం విధించిందని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో పోర్టు ఎలిజబెత్‌లో జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు జో రూట్‌ను ఔట్ చేసిన తర్వాత రబాడ శ్రుతిమించి సెలబ్రెషన్స్ చేశాడు. దీంతో ఐసీసీ అతనిపై ఒకటెస్టు నిషేధం విధించింది. ఆటగాళ్ల ప్రవర్తన నియమావళిలోని 2.5 నిబంధనను రబాడ అతిక్రమించినట్లు తేల్చిన మ్యాచ్ రిఫరీ.. అతని మ్యాచ్ ఫీజులో కోత విధించడంతోపాటు ఒక డీ మెరిట్ పాయింట్‌ను కేటాయించాడు. దీంతో రబాడ నిషేధం పాలయ్యాడు. అయితే ఈ నిర్ణయాన్ని లీ వ్యతిరేకిస్తున్నాడు. క్రికెట్‌ను క్రీడాస్ఫూర్తితో ఆడాలనుకోవడంలో తప్పులేదని, అయితే రబాడపై కఠిన నిర్ణయం పరమ చెత్త అని ట్వీట్ చేశాడు. బ్యాట్స్‌మెన్ ఔటైన సందర్భంగా రబాడ సెలబ్రేట్ చేసుకున్నాడని దీంట్లో తప్పేంలేదని బ్రెట్ లీ సూత్రీకరించాడు. ఈ విషయంలో ఐసీసీ నిర్ణయంతో ఏకీభవించలేనని తెలిపాడు. మరోవైపు నాలుగో టెస్టుకు రబాడ దూరం కావడం ప్రొటీస్‌కు పెద్ద దెబ్బ. ఈ సిరీస్‌లో 14 వికెట్లు తీసిన రబాడ.. లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇక మూడో టెస్టు విషయానికొస్తే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 499/9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం సఫారీలు 209 పరుగులకు ఆలౌటయ్యారు. అనంతరం ఫాలో ఆన్ ఆడుతున్న సౌతాఫ్రికా.. ఆదివారం కడపటి వార్తలందేసరికి 48 ఓవర్లలో 74/5 చేసి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే మరో 216 పరుగులు చేయాలి.










Untitled Document
Advertisements