రాహుల్ పై కోహ్లి ప్రశంసలు...పంత్ పనైపోయినట్టేనా...?

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 04:58 PM

రాహుల్ పై కోహ్లి ప్రశంసలు...పంత్ పనైపోయినట్టేనా...?

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో వికెట్‌కీపర్‌గా అనూహ్య చాన్స్ దక్కించుకున్న లోకేశ్ రాహుల్ సూపర్ సక్సెస్ కావడంతో విరాట్ కోహ్లి సెలెక్షన్ ప్రక్రయపై స్పందించాడు. లోకేశ్ కీపర్‌గా రాణించడంతో జట్టులో సమతూల్యత వచ్చిందని అన్నాడు. దీంతో రాబోయే రోజుల్లో రిషభ్ పంత్ రిజర్వ్ వికెట్ కీపర్ పాత్రకే పరిమితమయ్యే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆసీస్‌తో ఆదివారం మూడో వన్డే ముగిశాక మాట్లాడుతూ.. రాహుల్ కీపర్‌గా రాణించడంతో జట్టులో అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకునే వెసులుబాటు కలిగిందని కోహ్లీ వ్యాఖ్యానించాడు. జట్టులో కీపర్ స్థానం ఎప్పుడూ ఓపెన్‌గానే ఉంటుందని, ఎవరైతే సత్తాచాటుతారో వాళ్లే అందులో పాతుకుపోతరాని నర్మగర్భంగా వ్యాఖ్యానించాడు. దీంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వారసునిగా జట్టులోకి వచ్చి విఫలమవుతున్న పంత్ స్థానానికి ఎసరు వచ్చినట్లేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు 2003 వరల్డ్‌కప్ స్పెషలిస్ట్ కీపర్ లేకుండానే భారత్ బరిలోకి దిగి అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఈక్రమంలో ఫైనల్ వరకు చరి రన్నరప్‌గా నిలిచింది. ఆనాడు రాహుల్ ద్రవిడ్ తాత్కాలిక కీపర్ పాత్రలో ఒదిగిపోయాడు. రాహుల్‌ను కూడా భవిష్యత్తులో ఇలాగే ఉపయోగించుకునే అవకాశముందని కోహ్లీ తెలిపాడు. రాహుల్ కొత్తపాత్రలోకి వెళ్లడంతో జట్టుకు అనేక ప్రయోజనాలున్నాయని, ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల సత్తా రాహుల్ సొంతమని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఆసీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ రెండో మ్యాచ్‌లో కంకషన్‌కు పంత్ గురయ్యాడు. దీంతో వికెట్ కీపర్‌గా వ్యవహరించిన రాహుల్ అదరగొట్టాడు. దీంతో అతడిని కీపర్‌గా కొనసాగించాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.






Untitled Document
Advertisements