జియో మరో షాక్...ఫ్రీగా 679 లైవ్ టీవీ చానెళ్ళు

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 05:53 PM

జియో మరో షాక్...ఫ్రీగా 679 లైవ్ టీవీ చానెళ్ళు

స్మార్ట్ ఫోన్ టీవీ చూడటానికి ఉపయోగపడే జియో టీవీ యాప్ ను రూపొందించి దాదాపు మూడేళ్లు అవుతుంది. రిలయన్స్ జియో వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండానే ఈ సేవలను పొందుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, జియో టీవీ ఇప్పుడు మొత్తం 679 లైవ్ టీవీ చానెళ్లను అందిస్తోంది, ఎయిర్ టెల్ ఎక్స్‌స్ట్రీమ్, వొడాఫోన్ ప్లే వంటి వాటిని చాలా సులభంగా వెనక్కి నెట్టి ముందుకు చేరుకుంది. 679 లైవ్ టీవీ చానెళ్లను వినియోగదారులకు ఉచితంగా జియో ఇప్పుడు ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతం జియో కేవలం అన్ లిమిటెడ్ కాలింగ్ విషయంలో మాత్రమే మిగతా నెట్ వర్క్ ల కంటే కాస్త వెనకబడి ఉంది. డేటా ప్లాన్లు కూడా ఎయిర్ టెల్, వొడాఫోన్ కంటే జియోలోనే చవకగా లభిస్తున్నాయి. పోటీ సంస్థలు 400 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లను కూడా అందించడం లేదు. కానీ జియో ఏకంగా 679 టీవీ చానెళ్లను అందిస్తోంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ప్రస్తుతం 367 లైవ్ టీవీ చానెల్‌లను అందిస్తుండగా, తరువాత వొడాఫోన్ ప్లే 350 చానెల్‌లను అందిస్తోంది. వొడాఫోన్ తో పోలిస్తే దాదాపు రెట్టింపు చానెళ్లను జియో అందిస్తూ ఉండటం విశేషం. రిలయన్స్ జియో తన వినియోగదారులకు మెరుగైన కంటెంట్‌ను అందించడంపైనే దృష్టి పెట్టింది. జియో టీవీ లేదా జియో సినిమా.. ఈ రెండు యాప్ లను జియో ప్రారంభించడానికి కారణం అదే. అందుకే సన్ నెక్స్ట్ తో భాగస్వామ్యం కుదుర్చుకుని దానికి సంబంధించిన కంటెంట్ ను కూడా జియో సినిమా యాప్ లో ఉచితంగా అందిస్తోంది. ఇప్పుడు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 679 లైవ్ టీవీ చానెల్‌లను వినియోగదారులకు జియో టీవీ అందించే జియో టీవీ యాప్ అందిస్తోంది. ఈ 679 చానెళ్లను 13 రంగాలుగా విభజించింది. బిజినెస్ న్యూస్ చానెళ్లు 7, భక్తి చానెళ్లు 66, ఎడ్యుకేషనల్ చానెళ్లు 50, ఎంటర్టైన్మెంట్ చానెళ్లు 125, ఇన్ఫోటైన్‌మెంట్ చానెళ్లు 38, జియో దర్శన్ చానెళ్లు 8, కిడ్స్ చానెళ్లు 32, లైఫ్‌స్టైల్ చానెళ్లు 17, సినిమా చానెళ్లు 62, సంగీతం చానెళ్లు 45, న్యూస్ చానెళ్లు (202), షాపింగ్ చానెల్ 1, స్పోర్ట్స్ చానెళ్లు 26 అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు రిలయన్స్ జియోకు ‘జియో దర్శన్’ పేరిట కొన్ని చానెళ్లు ఉన్నాయి. ఈ చానెళ్ల ద్వారా దేశవ్యాప్తంగా ప్రసిద్ధ దేవాలయాలలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను చూడవచ్చు. స్టాండర్డ్ లైవ్ టీవీ చానెళ్లతో పాటు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియోకు జియో బాలీవుడ్ ప్రీమియం హెచ్‌డీ, జియో క్రికెట్ 1 హెచ్‌డీ, జియో క్రికెట్ 2 హెచ్‌డీ, జియో క్రికెట్ 3 హెచ్‌డీ, జియో క్రికెట్ 4 హెచ్‌డీ, జియో క్రికెట్ ఇంగ్లీష్ హెచ్‌డీ, జియో సినిమా, జియో సినిమా యాక్షన్, జియో సినిమా కామెడీ, జియో తెలుగు హిట్స్ హెచ్‌బీ వంటి సొంత చానెళ్లు కూడా ఉన్నాయి. స్పోర్ట్స్, సినిమా, న్యూస్ ఇలా అన్ని రంగాల్లో తనకంటూ ప్రత్యేక చానెళ్లను కూడా జియో ప్రారంభిస్తోంది. అయితే మరో వైపు, భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా తమ యాప్స్ లో సొంత చానెల్‌లను అందించడం లేదు. దీంతో వాటిలో ఉండే చానెళ్ల సంఖ్య పెరగడం లేదు. రిలయన్స్ జియోలో కేవలం జియో బ్రాండింగ్ చానెల్సే 30 పైగా ఉన్నాయి. మిగిలిన రెండు టెల్కోలు వీటి సంఖ్య సున్నాగా ఉంది. ఈ జియో బ్రాండెడ్ లైవ్ టీవీ చానెల్స్ లో లభించే కంటెంట్ ఇతర చానెళ్లు అందించే కంటెంట్ కంటే భిన్నంగా ఉంటుంది. కంటెంట్ విషయానికి వస్తే జియో టీవీ యాప్ వొడాఫోన్ ప్లే, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ యాప్ ల కంటే చాలా ముందు ఉంది. కానీ మిగతా ఫీచర్ల విషయానికి వస్తే.. ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్, వొడాఫోన్ ప్లేల్లోనే ముందున్నాయి. ఈ రెండూ జియో టీవీ కంటే మెరుగైన యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉన్నాయి. జియో టీవీ యూజర్ ఇంటర్ ఫేస్ కాస్త గందరగోళంగా ఉంటుంది. చానెళ్లను బ్రౌజ్ చేయడం జియో టీవీలో కాస్త కష్టం. కానీ సెర్చ్ ఫీచర్ మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే Featured ట్యాబ్ ద్వారా ప్రముఖ షోలను సులభంగా కనిపెట్టవచ్చు. జియో టీవీలో ఉన్న seven-day catch-up TV ఆప్షన్ ద్వారా వినియోగదారులు గత వారం ప్రోగ్రాంలు కూడా చూడవచ్చు. ఈ యాప్ లో స్క్రీన్‌షాట్‌లను తీయడం కుదరదు. అయితే ప్రేక్షకులు తమకు నచ్చిన షోలను రికార్డ్ చేసుకుని తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు చూసుకోవచ్చు. ఇటీవలే ఈ యాప్ లో డార్క్ మోడ్, పిక్చర్-ఇన్-పిక్చర్(పీఐపీ) మోడ్ ఫీచర్లను అందుకుంది. ఇవి రెండూ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.



















Untitled Document
Advertisements