ముంబైలో గుర్రాలపై పోలీసుల గస్తీ!

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 06:07 PM

ముంబైలో గుర్రాలపై పోలీసుల గస్తీ!

మహారాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రత విషయంలో పాత పద్దతినే అమలు చేయాలని నిర్ణయించింది. ప్రజలకు భద్రతను కల్పించేందుకు…అన్ని సమయాల్లో అందుబాటులో ఉండేందుకు ముంబైలో ప్రత్యేకంగా గుర్రపు దాళాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు. ఈ గుర్రపు దళంలో ఒక SI, ఒక అసిస్టెంట్ PSA, నలుగురు హవల్దార్లు, 32 మంది కాని స్టేబుళ్లు ఉంటారు.ముంబైలో జనం ఎక్కువగా, ట్రాఫిక్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో వాహనాలతో వెళ్లి గస్తీ నిర్వహించడం కంటే గుర్రాలపై వెళ్లడం సులువుగా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ చెప్పారు. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక రోజులు, ర్యాలీల సమయంలో గుర్రాలపై గస్తీ విధానం ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. గుర్రంపై విధులు నిర్వహించే ఒక సాయుధ పోలీసు నేలపై ఉన్న 30 మంది పోలీసులతో సమానమని, ఎత్తులో ఉండడంతో నిఘా బాగుంటుందన్నారు. పుణే, నాగపూర్ వంటి నగరాల్లో దీన్ని అమల్లోకి తెస్తామని, ప్రస్తుతం పోలీసు విభాగంలో 17 గుర్రాలు ఉన్నాయని వీటి సంఖ్య 30కి పెంచుతామని తెలిపారు. మహారాష్ట్రలో 1932కు ముందు గుర్రపు దళం ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో మళ్లీ 88 ఏళ్ల తర్వాత ఈ విధానం అమల్లోకి రానుంది ఈ దళం.





Untitled Document
Advertisements