ఫిబ్రవరి నుంచి వాట్సాప్ పని చేయని ఫోన్లు!

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 06:52 PM

ఫిబ్రవరి నుంచి వాట్సాప్ పని చేయని ఫోన్లు!

వాట్సాప్ తన వినియోగదారులకు పిడుగు లాంటి వార్త పేల్చింది. ఫిబ్రవరి 1 నుంచి కొన్ని స్మార్ట్ ఫోన్లకు వాట్సాప్ పని చేయదని తేల్చేసింది. విండోస్ ఫోన్లకు ఈ సపోర్ట్ ఇప్పటికే పూర్తిగా నిలిచిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ల కొత్త వాట్సాప్ అకౌంట్ ను క్రియేట్ చేయడం, దాన్ని వాట్సాప్ ధ్రువీకరించడం ఇకపై కుదరదు. ఈ విషయాన్ని వాట్సాప్ తన అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ అస్సలు పని చేయని ఫోన్లు ఇవే! ఐవోఎస్ 8 లేదా అంత కంటే పాత వెర్షన్ల ఆపరేటింగ్ సిస్టం మీద పనిచేసే యాపిల్ ఐఫోన్లలో ఫిబ్రవరి 1 తర్వాత వాట్సాప్ పనిచేయదు. ఆరోజు వరకు మీరు ఈ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. దానికి ఎటువంటి ఆటంకం కలగదు. ఒకవేళ ఈ ఆపరేటింగ్ సిస్టంలపై మాత్రమే నడిచే ఐఫోన్లలో కూడా మీరు వాట్సాప్ ను ఉపయోగించుకోవాలనుకుంటే మాత్రం దానికి ఒకటే దారి. మీ ఐఫోన్ లో ప్రస్తుతం ఇన్ స్టాల్ అయిన వాట్సాప్ ను అస్సలు అప్ డేట్ చేయకండి. అలాగే అన్ ఇన్ స్టాల్ చేసి మళ్లీ ఇన్ స్టాల్ చేయకండి. ఈ సందర్భంలో మాత్రమే మీరు వాట్సాప్ ను ఉపయోగించగలరు. అప్ డేట్ చేసినా, అన్ ఇన్ స్టాల్ చేసి మళ్లీ ఇన్ స్టాల్ చేసినా వాట్సాప్ కోసం మీరు కొత్త ఫోన్ కొనుక్కోవాల్సిందే! ఆండ్రాయిడ్ ఎక్లెయిర్ 2.3.7 లేదా దాని కంటే పాత వెర్షన్ పై పనిచేసే అన్ని స్మార్ట్ ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోనుంది. ఈ స్మార్ట్ ఫోన్లలో ఫిబ్రవరి 1 వరకు మాత్రమే వాట్సాప్ పని చేస్తుందని, ఆ తర్వాత పని చేయదని వాట్సాప్ తన వెబ్ సైట్ లో పేర్కొంది. ఈ ఆపరేటింగ్ సిస్టంలపై మాత్రమే నడిచే స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ వాడాలనుకుంటే ఒకటే దానికి కూడా ఒక మార్గం ఉంది. ఐఫోన్ తరహాలోనే ఇందులో కూడా వాట్సాప్ ను అప్ డేట్ కానీ, అన్ ఇన్ స్టాల్ కానీ చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే ఐఫోన్ వినియోగదారుల తరహాలోనే మీరు కూడా కొత్త ఫోన్ కొనుక్కోవాలి. విండోస్ ఆపరేటింగ్ సిస్టంపై నడిచే ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ ఇప్పటికే నిలిచిపోయింది. డిసెంబర్ 31వ తేదీకే ఈ సపోర్ట్ ను వాట్సాప్ నిలిపివేసింది. అయితే జియో ఫోన్ వినియోగదారులకు మాత్రం వాట్సాప్ ఎటువంటి షాక్ ఇవ్వలేదు. KaiOS 2.5.1కు తర్వాతి వెర్షన్లపై పనిచేసే అన్ని ఫోన్లపై వాట్సాప్ ఎటువంటి అంతరాయం లేకుండా పనిచేస్తుంది. ఈ ఫోన్లలో జియో ఫోన్, జియో ఫోన్ 2 కూడా ఉన్నాయి. తాము అందించే లేటెస్ట్ ఫీచర్లను అందుకునే సామర్థ్యం ఈ ఓఎస్ లకు ఉండదని వాట్సాప్ పేర్కొంది. వీరిని కొత్త ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఫోన్లకు అప్ గ్రేడ్ అవ్వాలని వాట్సాప్ సూచించింది. 2009లో తాము వాట్సాప్ ను ప్రారంభించినప్పుడు మార్కెట్ వేరుగా ఉందని, ఇప్పుడు వేరుగా ఉందని వాట్సాప్ తెలిపింది. వాట్సాప్ లాంచ్ అయినప్పుడు మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్లలో 70 శాతం వరకు బ్లాక్ బెర్రీ, నోకియాలు అందించే ఆపరేటింగ్ సిస్టంలపై పనిచేసేవని పేర్కొంది. ఇప్పుడు మార్కెట్లో 99.5 శాతంగా ఉన్న గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ స్మార్ట్ ఫోన్లు అప్పట్లో 25 శాతం కూడా లేవని తెలిపింది.













Untitled Document
Advertisements