మైకులు బంద్...అమల్లోకి ఎన్నికల కోడ్

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 07:00 PM

మైకులు బంద్...అమల్లోకి ఎన్నికల కోడ్

రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు,9 కార్పొరేషన్ లలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలు కానుంది. ఒక్క కరీనంగర్ కార్పోరేషన్ మినహా ఈనెల 22న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కరీంనగర్ కార్పొరేషన్ కు మాత్రం జనవరి 24 న పోలింగ్ జరగనుంది. మెజార్టీ మున్సిపాలిటీల్లో ఓటర్ స్లిప్స్ పంపిణీ, బ్యాలెట్ పత్రాల ముద్రణ ఇప్పటికే పూర్తయింది. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఈ ఎన్నికలకు బ్యాలెట్ పత్రం తెలుపు రంగులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఎన్నికల సిబ్బందిగా 44 వేల మంది విధుల్లో పాల్గొననున్నారు. ఓటర్లు తమ ఓటర్ స్లిప్స్ ను ‘నా ఓటు యాప్’ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దొంగ ఓట్లు వేయకుండా దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఈ ఎన్నికల్లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను వాడనున్నారు. కొంపల్లి మున్సిపల్ పరిధిలోని 6 వార్డులు, 10 పోలింగ్ కేంద్రాల్లో ఈ యాప్ ను వాడనున్నారు, ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక్కో ప్రత్యేక పోలింగ్ ఈ రికగ్నైజేషన్ యాప్ ను అమలు చేయనున్నారు. ఎన్నికల సిబ్బంది కోసం ఎన్నికల సంఘం ఆన్ లైన్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో జనవరి 22న సెలవు ప్రకటించింది. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో ద్వారా రికార్డ్ చేయనుంది. పోలింగ్ సరళి తెలుసుకునేందుకు వెబ్ కాస్టింగ్ నిర్వహించనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనుంది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు మద్యం షాపులు, బార్లు మూసివేయాలని ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రసార, ప్రచార మాధ్యమాల్లో రాజకీయ పార్టీల ప్రచారాలను నిషేదించాలని తెలిపింది. అదే విధంగా సోషల్ మీడియా ద్వారా పంపే బల్క్ మెసేజ్ లపై కూడా నిషేధం విధించింది ఈసీ.





Untitled Document
Advertisements