టీమిండియా న్యూజిలాండ్ పర్యటన...పూర్తి షెడ్యూల్

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 12:45 PM

టీమిండియా న్యూజిలాండ్ పర్యటన...పూర్తి షెడ్యూల్

టీమిండియా.. న్యూజిలాండ్ పర్యటనకి వెళ్లబోతోంది. ఈ నెల 24 నుంచి కివీస్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌లో భారత్ జట్టు తలపడబోతోంది. ఈ మేరకు భారత సెలక్టర్లు ఇప్పటికే టీ20 జట్టుని ప్రకటించగా.. న్యూజిలాండ్‌ కూడా 14 మందితో కూడిన టీ20 టీమ్‌ని అనౌన్స్ చేసింది.

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గప్తిల్, రాస్ టేలర్, స్కాట్ కుగ్లిజిన్, కొలిన్ మున్రో, కొలిన్ గ్రాండ్‌హోమ్, టామ్ బ్రూసీ, డార్లీ మిచెల్, మిచెల్ శాంట్నర్, టిమ్ సైఫర్ట్ (వికెట్ కీపర్), హమీశ్ బెనెట్, ఇస్ సోధి, టిమ్ సౌథీ, బ్లైర్ టింకర్

టీ20, వన్డే మ్యాచ్‌ల షెడ్యూల్:

భారత కాలమాన ప్రకారం టీ20 మ్యాచ్‌లు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి జరగనుండగా.. వన్డే మ్యాచ్‌లు ఉదయం 7.30 గంటలు మొదలుకానున్నాయి.

*జనవరి 24న అక్లాండ్ వేదికగా తొలి టీ20,
*26న అక్లాండ్ వేదికగా రెండో టీ20,
*29న హామిల్టన్ వేదికగా మూడో టీ20,
*31న వెల్లింగ్టన్ వేదికగా నాలుగో టీ20,
*2న బే ఓవల్ వేదికగా ఐదో టీ20,

*ఫిబ్రవరి 5న హామిల్టన్ వేదికగా తొలి వన్డే,
* 8న ఆక్లాండ్ వేదికగా రెండో వన్డే,
*11న బే ఓవల్ వేదికగా మూడో వన్డే.

*టెస్టు సిరీస్:

టెస్టు మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం.. ఉదయం 4 గంటలకి ప్రారంభంకానున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రం 3.30 గంటలకే మొదలవనుంది.

*ఫిబ్రవరి 14 నుంచి 16 వరకూ హామిల్టన్ వేదికగా 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్,
*21 నుంచి 25 వరకూ వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్టు,
*29 నుంచి మార్చి 4 వరకూ క్రైస్ట్‌చర్చ్ వేదికగా రెండో టెస్టు.





Untitled Document
Advertisements