బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న తెలుగమ్మాయి

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 12:51 PM

బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న తెలుగమ్మాయి

ద‌క్షిణాది న‌టీన‌టుల విష‌యంలో ఇప్పుడు ఉత్త‌రాది ఫిలిమ్ మేక‌ర్స్ ఆలోచ‌నా తీరు మారుతోంది. ద‌క్షిణాదిన పాన్ ఇండియా చిత్రాలు ఎక్కువ‌గా రూపొందుతుండటం వ‌ల్ల ఇక్క‌డి న‌టీన‌టుల గురిం చి బాలీవుడ్ ప్రేక్ష‌కులు తెలుసుకుంటున్నారు. దీంతో బాలీవుడ్ ఫిలిమ్ మేక‌ర్స్ దక్షిణాది న‌టీన‌టుల‌కు తమ సినిమాల్లో అవ‌కాశం ఇస్తున్నారు. తాజాగా హీరోయిన్ ఈషారెబ్బా కూడా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌`లో కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈషారెబ్బా త్వ‌ర‌లోనే బాలీవుడ్ సినిమాలో హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. సోన‌మ్ క‌పూర్ సోద‌రుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ క‌పూర్ హీరోగా న‌టిస్తోన్న చిత్రంలో ఈషారెబ్బా హీరోయిన్‌గా న‌టిస్తుంది. జాతీయ అవార్డ్ గ్ర‌హీత రాజ్‌సింగ్ చౌద‌రి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఈషారెబ్బా రాజస్థానీ అమ్మాయిగా న‌టించనుందట‌.





Untitled Document
Advertisements