జియో నుంచి కొత్త సేవలు...గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పేలకు షాక్

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 01:56 PM

జియో నుంచి కొత్త సేవలు...గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పేలకు షాక్

జియో ఇప్పుడు మరో కొత్త రకం సేవలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకు రావాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ట్రయల్స్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. రిలయన్స్ జియో తన మైజియో యాప్ ద్వారా సరికొత్త యూపీఐ పేమెంట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. దీంతో బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా చెల్లింపులు నిర్వహించొచ్చు. కొంత మంది యూజర్లకు మైజియో యాప్‌లో యూపీఐ పేమెంట్స్ ఆప్షన్ కనిపిస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి. జియో సబ్‌స్క్రైబర్లు @jio లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్‌‌తో యూపీఐ ఐడీని జనరేట్ చేసుకోవచ్చు. రిలయన్స్ జియో కొత్త సేవలతో జియో యూజర్లు మైజియో యాప్ నుంచే డైరెక్ట్‌గా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. ఎన్‌ట్రాకర్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. జియో యూజర్లు వారి బ్యాంక్ అకౌంట్‌‌ను జియో యాప్‌లోని యూపీఐతో లింక్ చేసుకొని పేమెంట్స్ నిర్వహించొచ్చు. బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు పంపొచ్చు. మనీ పంపడం, స్కాన్ అండ్ పే, రిక్వెస్ట్ మనీ, పాస్‌బుక్ వంటి పలు ఆప్షన్లు కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. కస్టమర్లు మల్టీపుల్ బ్యాంక్ అకౌంట్లను మైజియో యాప్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. యూపీఐ పేమెంట్స్ పేరు జియేపే మాత్రం కాకపోవచ్చు. రిలయన్స్ ఇప్పటికే పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు ఆటోపే సేవల కోసం జియోపే పేరును ఉపయోగిస్తోంది. కంపెనీ తన కస్టమర్లకు ఎప్పటి నుంచి ఈ యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువస్తుందో తెలియదు. వచ్చే కొన్ని వారాలు లేదా కొన్ని నెలల్లో ఈ సేవలు కస్టమర్లకు అందుబాటులోకి రావొచ్చు. మైజియో యాప్‌కు యూపీఐ పేమెంట్ ఆప్షన్ వచ్చి చేరితే.. అప్పుడు పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే వంటి సంస్థలకు పోటీ తప్పేలా లేదు. జియో కస్టమర్లు అందరూ మైజియో యాప్ ఉపయోగిస్తూ ఉంటారు. దీంతో అందరికీ యూపీఐ సేవలు అందుబాటులోకి వస్తాయి.





Untitled Document
Advertisements