అల్లు అర్జున్ సినిమా కోసం భారీ పారితోషికం

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 01:58 PM

అల్లు అర్జున్ సినిమా కోసం భారీ పారితోషికం

ఏడాదికి ఏడెనిమిది సినిమాలు చేస్తూ.. కోలీవుడ్‌లో రైజింగ్ స్టార్‌గా దూసుకుపోతున్నాడు విజయ్ సేతుపతి. ఛాలెంజింగ్ రోల్స్‌కి పెద్ద పీట వేసే ఈ స్టార్ హీరోని తమిళ ప్రేక్షకులు మక్కల్ సెల్వన్ అనే బిరుదుతో పిలుచుకుంటారు. ఇక.. ఈ మధ్య హీరోగానే కాకుండా.. అవసరమైతే విలన్‌గానూ మురిపించడానికి సై అంటున్నాడు ఈ వెర్సటైల్ యాక్టర్. మెగా ఫ్యామిలీ నుంచి రాబోతున్న వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ 'ఉప్పెన'లో విజయ్‌ సేతుపతే ప్రతినాయకుడు. ఇక.. ఇలయదళపతి విజయ్ నటిస్తున్న 'మాస్టర్' సినిమాలోనూ సేతుపతే విలన్‌గా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత.. మరోసారి విలన్‌గా నటించడానికి సిద్ధమవుతున్నాడట విజయ్‌ సేతుపతి. అది కూడా అల్లు అర్జున్ సినిమాలో. బన్నీ-సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం.. 10 కోట్ల పారితోషికాన్ని అందుకోబోతున్నాడని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

అల్లు అర్జున్, సుకుమార్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక.. ఇప్పటికే మైత్రీ-సుకుమార్ రైటింగ్స్‌ నిర్మిస్తున్న 'ఉప్పెన'లో విలన్‌గా నటిస్తుండడంతో.. ఈ చిత్రంలోనూ విజయ్‌ సేతుపతినే ప్రతినాయకుడిగా ఎంపిక చేశారట. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆద్యంతం అడవుల బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. ఈ మూవీలో విజయ్‌ సేతుపతి పాత్ర ఎంతో కీలకంగా ఉండనుందట. దానికోసం.. బల్క్‌ డేట్స్‌ అవసరమవుతాయట. ఈనేపథ్యంలోనే.. విజయ్‌ సేతుపతికి 10 కోట్లు పారితోషికంగా ఇవ్వబోతున్నట్టు ఫిల్మ్‌ నగర్ టాక్. పైగా.. విజయ్ సేతుపతి నటిస్తుండడంతో.. తమిళంలో కూడా ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉండడంతో.. రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలు సంతృప్తిగానే ఉన్నారట. మొత్తంమీద.. విజయ్‌ సేతుపతి విలనిజం బన్నీ-సుకుమార్ సినిమాకి ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.





Untitled Document
Advertisements