మరో కొత్త ప్రయోగంతో సమంత

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 02:03 PM

మరో కొత్త ప్రయోగంతో సమంత

వెండితెరపై సమంతది విజయవంతమైన ప్రయాణం. కథానాయికగా ఎన్నో విజయాలు అందుకున్నారు. పాత్రలు, చిత్రాల పరంగా... ప్రయోగాలు చేయడానికి ఆమె వెనుకంజ వేయలేదు. అగ్ర కథానాయికగా కొనసాగుతున్న ఆమె... డిజిటల్‌ ఫ్లాట్‌ఫార్మ్‌ కోసం వెబ్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మాన్‌ 2’ చేయడానికి అంగీకరించి ఆశ్చర్యపరిచారు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే... త్వరలో ఆమె ఓ టాక్‌ షో చేయనున్నారని సమాచారం. సమంత ‘టాక్‌ షో’కి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. ‘నెం1 యారి’ అంటూ రానా దగ్గుబాటి ఓ టాక్‌ షో చేశారు.

‘ఫీట్‌ అప్‌ విత్‌ ది స్టార్స్‌’, అంతకు ముందు మరికొన్ని టాక్‌ షోలు లక్ష్మీ మంచు చేశారు. ఈ విధంగా టాక్‌ షోలు చేసిన స్టార్స్‌ జాబితాలో సమంత త్వరలో చేరనున్నారని తెలిసింది. ఇప్పటివరకూ వచ్చిన టాక్‌ షోలకు విభిన్నంగా సమంత షో ఉండబోతుందట. ఎవరి కోసం సమంత ఈ టాక్‌ షో చేస్తున్నారు? దీన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు? సెలబ్రిటీల్లో ఎవరెవరు వస్తారు? తదితర వివరాలు త్వరలో తెలియజేస్తారట.





Untitled Document
Advertisements