స్వల్పంగా దిగిన బంగారం ధర!

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 03:12 PM

స్వల్పంగా దిగిన బంగారం ధర!

పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి శుభవార్తనే. పసిడి ధర తగ్గితే.. వెండి ధర మాత్రం అక్కడే కొనసాగింది. ఎలాంటి మార్పు లేదు.
అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర స్వల్పంగా పెరిగినప్పటికీ దేశీ మార్కెట్‌లో జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి రికవరీ చెందటం కూడా బంగారం ధర తగ్గుదలకు దోహదపడిందని చెప్పుకోవచ్చు.హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం తగ్గింది. రూ.100 దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ.41,770 నుంచి రూ.41,670కు క్షీణించింది.అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. అయితే 24 క్యారెట్ల బంగారం మాదిరి మాత్రం కాదు. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90 తగ్గుదలతో రూ.38,290 నుంచి రూ.38,200కు క్షీణించింది.బంగారం ధర తగ్గితే కేజీ వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధరలో ఈ రోజు ఎలాంటి మార్పు లేదు. రూ.49,500 వద్దనే నిలకడగా ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ స్తబ్దుగా ఉండటం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరలు ఇలానే ఉన్నాయి.గ్లోబల్ మార్కెట్‌లో కూడా పసిడి స్వల్పంగా పైకి కదిలింది. బంగారం ధర ఔన్స్‌కు 0.05 శాతం పెరుగుదలతో 1561.35 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.04 శాతం పెరుగుదలతో 18.07 డాలర్లకు ఎగసింది.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 క్షీణించింది. దీంతో ధర రూ.39,110 నుంచి రూ.39,100కు తగ్గింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 క్షీణతతో రూ.40,300కు తగ్గింది. ఇక కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.49,500 వద్ద స్థిరంగా కొనసాగింది.దేశీ మార్కెట్‌లో బంగారం ధర గత ఏడాది దాదాపు 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.రానున్న కాలంలో పసిడి రేటు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.50,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.





Untitled Document
Advertisements