పెళ్లి కొడుకు తండ్రితో పెళ్లి కూతురి తల్లి పరార్!

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 03:13 PM

పెళ్లి కొడుకు తండ్రితో పెళ్లి కూతురి తల్లి పరార్!

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన యువతీ యువకుడికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఫిబ్రవరిలో ఘనంగా వివాహం జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు పెరిగాయి. అక్కడే ఎవరూ ఊహించని ఘటన జరిగింది. వరుసకు అన్నాచెల్లెళ్లు అయ్యే వరుడి తండ్రి, వధువు తల్లి ప్రేమలో పడ్డారు. తమ బంధాన్ని ఎవరూ అంగీకరించరన్న కుటుంబాలను వదిలేసి కొద్దిరోజుల క్రితం ఇద్దరూ కలిసి పరారయ్యారు.ముందుగా వధువు తల్లి కనిపించకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఈలోగా వరుడు తండ్రి కూడా మిస్సింగ్ కావడంతో అనుమానం వచ్చింది. వీరి బంధంపై బంధువుల ఆరా తీయగా అసలు నిజం బయటపడింది. వీరిద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉందని, అదికాస్తా ప్రేమగా మారిందని తేలడంతో అందరూ నోరెళ్లబెట్టారు. తమ బిడ్డల పెళ్లి జరిగితే అన్నాచెల్లెలి వరుసగా మారాల్సి వస్తుందన్న ఆందోళనతో వారిద్దరూ పరారైనట్లు తెలిసింది. పెద్దల నిర్వాకంతో పిల్లల వివాహాన్ని బంధువులు రద్దు చేశారు.






Untitled Document
Advertisements