మేడారం జాతరకు స్పెషల్ బస్సులు

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 04:38 PM

మేడారం జాతరకు స్పెషల్ బస్సులు

అతిపెద్ద గిరిజన పండగ సమ్మక్క-సారలమ్మ జాతర. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం రవాణా సౌకర్యాలను కల్పించింది. ముఖ్యంగా రంగారెడ్డి రీజియన్ హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు 500 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 8 వరకు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీబస్‌స్టేషన్, దిల్‌ సుఖ్‌నగర్ బస్‌స్టేషన్, జగద్గిరిగుట్ట, నేరేడ్‌మెట్, కెపిహెచ్‌బి, మియాపూర్, లింగంపల్లి, లాల్ దర్వాజ ప్రాంతాలనుంచి బయలుదేరి, ఉప్పల్‌లోని వరంగల్ పాయింట్ మీదుగా బస్సులు నడుపుతున్నారు. మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు వివరాలను TS RTC అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు ప్రయాణికులు జాతరకు వెళ్లేందుకు అడ్వాన్స్ రిజర్వేషన్ (www.tsrtconline.in) సౌకర్యం కల్పించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య కూడా పెంచనున్నట్లు చెప్పారు. ఈ నెల 26వ తేదీ ఆదివారం ఎక్కువ రద్దీ ఉండే అవకాశం ఉండటంతో.. ప్రత్యేక బస్సులు ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.





Untitled Document
Advertisements