షిర్డీ సాయిబాబా వివాదానికి ముగింపు!

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 04:48 PM

షిర్డీ సాయిబాబా వివాదానికి ముగింపు!

షిర్డీ సాయిబాబా జన్మస్థలంపై తలెత్తిన వివాదం ముగిసింది. షిర్డీ స్థానికులు, సాయిబాబా ట్రస్ట్ ప్రతినిధులు, డిప్యూటీ సీఎం అజిత్​పవార్, శివసేన ఎంపీ సదాశివ్​ లోఖండే, బీజేపీ ఎమ్మెల్యే రాధాకృష్ణ విఖే పాటిల్ సోమవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్​ థాక్రేతో సమావేశమయ్యారు. సమావేశం తర్వాత ఎంపీ లోఖండే మాట్లాడుతూ.. సాయిబాబా ట్రస్ట్​ ప్రతినిధులతో ఈ వివాదంపై లోతుగా చర్చించామని, సీఎం సమావేశంతో సాయిబాబా జన్మస్థలంపై వివాదం ముగిసిందని చెప్పారు. సాయిబాబా జన్మస్థలం పాథ్రీ అంటూ చేసిన స్టేట్​మెంట్​ను సీఎం వెనక్కి తీసుకున్నారని చెప్పారు. అయితే దీనిపైఅధికారిక ప్రకట ప్రభుత్వం నుంచి రాలేదు. ఫాథ్రీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించడంపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని ట్రస్టు ప్రతినిధులను సీఎం థాక్రే ప్రశ్నించారని, సాయిబాబా జన్మస్థలంపైనే తమ అభ్యంతరం అని, అభివృద్ధికి సంబంధించిన విషయంలో కాదని వారు చెప్పారని లోఖండే తెలిపారు. సీఎం థాక్రేతో సమావేశం సంతృప్తికరంగా సాగిందని, దీంతో నిరసనలు విరమించాలని నిర్ణయించినట్టు బీజేపీ ఎమ్మెల్యే విఖే





Untitled Document
Advertisements