విమాన ప్రయాణికుల సంఖ్య తగ్గింది!

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 06:09 PM

విమాన ప్రయాణికుల సంఖ్య తగ్గింది!

విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌‌ గ్రోత్‌‌ రేటు కేవలం 3.74 శాతంగానే నమోదైంది. ఈ వృద్ధి రేటు 2018 లో 18 శాతంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ స్లోడౌన్‌‌లో ఉండడం, జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్‌‌ మూతపడడం, కన్జూమర్ డిమాండ్‌‌ తగ్గడం వలన ఇండియాలో ఎయిర్‌‌‌‌ ప్యాసింజర్‌‌‌‌ ట్రాఫిక్‌‌ గ్రోత్‌‌రేట్‌‌ సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితమయ్యిందని డైరక్టరేట్‌‌ జనరల్‌‌ ఆఫ్‌‌ సివిల్‌‌ ఏవియేషన్‌‌(డీజీసీఏ) సోమవారం ప్రకటించింది. చివరిసారిగా 2014 లో ఎయిర్‌‌‌‌ ట్రాఫిక్ గ్రోత్‌‌ రేట్‌‌ సింగిల్‌‌ డిజిట్‌‌గా నమోదైంది. దేశీయ షెడ్యూల్డ్‌‌ విమానాలు గతేడాది 14.41 కోట్ల ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చాయి. ఇది 2‌‌‌‌018 లో 13.89 కోట్లుగా నమోదైంది. 2019 లో ఎయిర్‌‌‌‌ ట్రాఫిక్ గ్రోత్‌‌ రేట్‌‌ సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితమవ్వడం నిరుత్సాహపరిచిందని డీజీసీఏ సీనియర్‌‌‌‌ అధికారులు తెలిపారు. 2020 లో తిరిగి డబుల్‌‌ డిజిట్‌‌ గ్రోత్‌‌కు చేరుకుంటామని అన్నారు. ఇండిగో ఎయిర్‌‌‌‌వేస్‌‌ 2019 లో కూడా మార్కెట్‌‌ లీడర్‌‌‌‌గా నిలిచింది. గతేడాది ప్రయాణించిన ప్రతి ఇద్దరి ప్రయాణికులలో ఒకరు ఇండిగో ఎయిర్‌‌‌‌వేస్‌‌ ద్వారానే ట్రావెల్‌‌ చేయడం గమనార్హం. ఈ కంపెనీ 20‌‌‌‌19 లో 6.79 కోట్ల ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చింది. మొత్తంగా 2018 లో 41.5 శాతంగా ఉన్న ఇండిగో మార్కెట్‌‌ వాటా, 2019 లో 47.1 శాతానికి పెరిగింది. గతేడాది 2.13 కోట్ల ప్రయాణికులు స్పైస్‌‌ జెట్‌‌ ద్వారా ట్రావెల్‌‌ చేశారు. ఈ కంపెనీకి 14.9 శాతం మార్కెట్‌‌ వాటా ఉంది. 2018లో ఈ ఎయిర్‌‌వేస్‌‌ ద్వారా 1.71 కోట్ల ప్యాసెంజర్లు ప్రయాణించారు. దీంతో ఈ ఎయిర్‌‌‌‌లైన్‌‌ 12.3 శాతం మార్కెట్‌‌ వాటాను పొందగలిగింది. ప్రభుత్వ సంస్థ ఎయిర్‌‌‌‌ఇండియా గతేడాది 1.83 కోట్ల ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చింది. ఈ కంపెనీకి మొత్తంగా 12.7 శాతం మార్కెట్‌‌ వాటా ఉంది. ఖర్చులు పెరగడంతో పాటు, ప్రయాణికుల ట్రాఫిక్‌‌ తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియన్‌‌ ఎయిర్‌‌‌‌లైన్లు నష్టాలతో ముగిస్తాయని విశ్లేషకులు తెలిపారు. అంతేకాకుండా అక్టోబర్‌‌‌‌–డిసెంబర్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌లో ఈ కంపెనీలు ధరలను పెంచలేకపోయాయని, ఇది వాటి బ్యాలెన్స్ షీట్లపై ప్రభావం చూపుతుందని తెలిపారు.









Untitled Document
Advertisements