భార్య అతిగా ఫోన్లో మాట్లాడుతుందని చంపేసిన భర్త

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 06:16 PM

భార్య అతిగా ఫోన్లో మాట్లాడుతుందని చంపేసిన భర్త

భార్య ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతుండటంతో పాటు సోషల్‌మీడియా ఎక్కువగా వినియోగిస్తోందన్న కారణంతో భర్త భార్యను దారుణంగా చంపేశాడు. రాజస్థాన్‌ రాజధాని జైపూర్ పరిధిలోని ఆమెర్ ప్రాంతానికి చెందిన అహ్మద్ అన్సారీ(26) అనే యువకుడికి రెండేళ్ల క్రితం నైనా మంగ్లానీ(22) అనే యువతితో వివాహమయ్యింది. వీరికి మూడు నెలల వయసున్న బాబు ఉన్నాడు. పెళ్లయినప్పటి నుంచి భార్య ఇంటి పనులు సరిగ్గా చేయకుండా ఎప్పుడూ ఫోన్ చూస్తూనే ఉండేది. రోజూ తాను తీసుకున్న ఫోటోలు ఫేస్‌బుక్‌లో పెట్టేది. దీంతో ఆమెకు 6వేలకు పైగా పాలోవర్స్‌ ఉన్నారు. దీనిపై అన్సారీ తరుచూ భార్యతో గొడవ పడేవాడు. ఫోన్ చూడటం మాని సరిగ్గా కాపురం చేయాలని చెప్పినా ఆమె వినిపించుకునేది కాదు. దీనికి తోడు ఆమె ఇటీవల చాలామందితో ఫోన్లో మాట్లాడుతుండటంతో అనుమానం పెంచుకున్నాడు. దీంతో భార్యను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. శనివారం సాయంత్రం భార్యను షికారు పేరుతో బయటకు తీసుకెళ్లాడు. అనేక ప్రాంతాలు తిప్పిన తర్వాత రాత్రివేళ ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు అన్సారీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Untitled Document
Advertisements