టీఆర్ఎస్ ను ఓడించడం బీజేపీకె సాధ్యం!

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 06:56 PM

టీఆర్ఎస్ ను ఓడించడం బీజేపీకె సాధ్యం!

కరీంనగర్ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి టీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. టీఆర్ఎస్ ను ఓడించే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్న విషయాన్ని ప్రజలు నమ్ముతున్నారని అన్నాడు. తాము చెబుతున్న అంశాలను ప్రజలు శ్రద్ధగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను డబ్బులు పెట్టి కొనడం, గుండాగిరి చేసి క్యాండిడెట్లను కిడ్నాప్ చేయడం వంటి చర్యలతో టీఆర్ఎస్ పట్ల ప్రజలకు విరక్తి కలిగిందని, ఈ వ్యవహారమంతా ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడం, ప్రతిపక్షం లేకుండా చేయడం వంటి వాటిని వారు అర్థం చేసుకుంటున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం కూడా ప్రజలు గమనించారని ఆయన అన్నారు. సీఎం వైఖరి చూస్తుంటే నిజాం తిరిగొచ్చాడా అన్న భయం ప్రజల్లో కలుగుతోందని వివేక్ అన్నారు. తుగ్లక్ లాగా రాత్రికి వచ్చిన ఆలోచనను సీఎం పొద్దున అమలు చేయాలనుకుంటున్నాడని, సెక్రటేరియట్, ఎర్రమంజిల్ కూల్చివేత వంటి ఆలోచనలు అలాంటివేనని అన్నారు వివేక్. కేసీఆర్ నియంతృత్వ పాలనకు బ్రేక్ వేయాలని, కారుకు పంక్చర్ చేయాలని ప్రజలు యోచిస్తున్నారని, ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో సీఎం చేసిన డ్రామా ప్రజలకు నచ్చలేదని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటంబం ఒక్కటే బంగారమైపోయిందని వివేక్ అన్నారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసి సొంత ఆస్తులు పెంచుకునేందుకు కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నిస్తోందని చెప్పారు. సొంత ఆస్తులు పెంచుకోవడం తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదని, గచ్చిబౌలిలో త్రిబుల్ -1 జియో కింద కేటీఆర్ వేలాది ఎకరాలు కొన్నాడని అన్నారు. అమెరికాలో ఉద్యోగం పోతే.. కొడుకు కేటీఆర్ ను పిలిపించి కేసీఆర్ సిరిసిల్ల నుంచి పోటీ చేయించారని, ఆ సమయంలో కేవలం 200 లోపు ఓట్ల లోపు మెజార్టీతోనే కేటీఆర్ గెలిచాడన్నారు వివేక్. నిజానికి అంతపెద్ద ఉద్యమ సమయంలో ఇంత చిన్న మెజార్టీ అంటే ఓడిపోయినట్లే లెక్కని చెప్పారు. మున్సిపల్ మంత్రిగా కూడా కేటీఆర్ ఫెయిలయ్యాడని, హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని అన్నారు. హైదరాబాద్ కు ఒక్క టెక్స్ టైల్ పార్కు రాలేదు. బీజేపీ ఎక్కడా లేదని చెబుతున్న కేటీఆర్… ఆయన చెల్లెను అడిగితే ఉన్నదో లేదో చెబుతుందని అన్నారు. నిజామాబాద్ లో 100 కోట్లు ఖర్చు చేసినా కేటీఆర్ చెల్లెలు ఓడిపోయింది. కరీంనగర్ లో కేసీఆర్ బంధువే బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ చేతిలో ఓడిపోయాడు. కరీంనగర్ ను లండన్ చేస్తానని నిధులు మాత్రం ఇవ్వలేదు. . గాలీలో మాటలు మాట్లాడితే ప్రజలు కచ్చితంగా తిరస్కరిస్తారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపాలిటీల్లో పర్యటించిన తనకు.. మున్సిపాలిటీలకు రాష్ట్రం నుంచి ఎలాంటి నిధులు రాలేదని ప్రజలు చెబుతున్నారని వివేక్ చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నిధులు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. మంత్రులే సీఎంను కలవలేరు… ప్రజలెలా కలవగలరు అంటూ మాయమాటలతో ఓట్లు వేయించుకోవాలని సీఎం ప్రయత్నిస్తున్నాడన్నారు వివేక్. హుజూర్ నగర్ తరహాలో ఈ ఎన్నికల్లో కూడా ఓట్లు కొనుగోలు చేసి వేయించుకోవాలని ప్రయత్నిస్తున్నాడనీ, ప్రజలు మాత్రం ఈసారి ఆలోచించి ఓటేయ్యాలనుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ ఎన్నికల గురించి వివేక్ మాట్లాడుతూ..” ఒకప్పుడు బీజేపీకి అభ్యర్థులు దొరకడమే కష్టంగా ఉండేది. కానీ ఈసారి టికెట్ల కోసం పోటీ విపరీతంగా పెరిగింది. బీజేపీకి ఈ ఎన్నికలు టెస్ట్ కేసుగా మారబోతున్నాయి.నరేంద్ర మోడీ పాలన చూసి ఈసారి బీజేపీకి ఓటు వేయాలని ప్రజలు అనుకుంటున్నారు. గ్యాస్, కిసాన్ యోజన కింద ఆరువేల రూపాయలు ఇతర కేంద్ర పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 2 లక్షలు లబ్ధిదారులకు డైరెక్ట్ అకౌంట్ లో వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆ సూచన కేంద్ర ప్రభుత్వానికి చెబుతాం. ఎన్నికలకు ముందు టఫ్ అనుకున్న వాతావరణం ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా మారింది” అని అన్నారు.





Untitled Document
Advertisements