అమీర్‌పేటలో 50 మంది విద్యార్థులపై పిచ్చికుక్కల దాడి

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 07:51 PM

అమీర్‌పేటలో 50 మంది విద్యార్థులపై పిచ్చికుక్కల దాడి

హైదరాబాద్‌లో పిచ్చి కుక్కల దాడిలో 50 మంది విద్యార్థులు గాయపడ్డారు. . అమీర్‌పేటలో మంగళవారం (జనవరి 21) సాయంత్రం ప్రభుత్వ పాఠశాల నుంచి వస్తున్న విద్యార్థులపై పిచ్చికుక్కలు దాడి చేశాయి. ధరమ్‌కరమ్‌ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు పిచ్చి కుక్కలను వెంబడించి ఓ కుక్కను చంపేశారు. చిన్నారులపైకి కుక్కలు ఒక్కసారిగా దూసుకురావడంతో వారంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో కుక్కలు వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బాధిత విద్యార్థులను నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రితో పాటు నగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీధి కుక్కలపై అధికారులకు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేశామని.. అయినా చర్యలు తీసుకోలేదని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీధుల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని.. పిల్లలు, మహిళలు ఆరుబయటకు రావాలంటేనే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Untitled Document
Advertisements