రెండ్రోజులు వైన్ షాపులు బంద్

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 08:18 PM

రెండ్రోజులు వైన్ షాపులు బంద్

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైన్స్‌ షాపులు బంద్ అయ్యాయి. సోమవారం సాయంత్ర 5 గంటల నుండి బుధవారం(జనవరి 22) సాయంత్రం 5 గంటల వరకు ఈ దుకాణాలు మూతపడనున్నాయి. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వైన్స్ షాపులు బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఇప్పటికే ఓ ప్రకటనలో తెలిపింది. అదే విధంగా ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా ఈ నెల 25న కూడా మద్యం షాపులు బంద్‌ కానున్నాయి. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలక్షన్ కమీషన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే మద్యం పంపిణీని అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. నిబంధనలు ఉల్లంఘించిన షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేసింది.

Untitled Document
Advertisements