‘జాను’ ఫస్ట్ సాంగ్...టూమచ్ ఎమోషనల్!

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 09:13 PM

‘జాను’ ఫస్ట్ సాంగ్...టూమచ్ ఎమోషనల్!

సమంత, శర్వానంద్‌లు జోడీగా నటిస్తున్న ‘జాను’ చిత్రం నుండి తొలి పాటను నేడు విడుదల చేశారు. సంగీత దర్శకుడు గోవింద్ వసంత బ్యూటిఫుల్ ట్యూన్‌కి శ్రీముణి అద్భుతమైన సాహిత్యం అందించగా.. చిన్మయి, గౌతమ్ భరద్వాజ్‌లు అంతే అద్భుతంగా ఆలపించారు. తమిళంలో విడుదలైన సంచలన విజయాన్ని సాధించిన ‘96’ మూవీని తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. తమిళ్‌లో త్రిష, విజయ్ సేతుపతి చేసిన పాత్రలను తెలుగులో సమంత, శర్వానంద్‌లు చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌ని డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ముగించుకుని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.


Untitled Document
Advertisements